సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య సరసన మరోసారి.. బాలీవుడ్ భామ

ABN, Publish Date - May 08 , 2026 | 07:18 PM

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా మారిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) – కొరటాల శివ (Koratala Siva) ప్రాజెక్ట్‌పై రోజుకో ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

NBK112

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా మారిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) – కొరటాల శివ (Koratala Siva) ప్రాజెక్ట్‌పై రోజుకో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం NBK112 పేరుతో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయిన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపికపై హాట్ టాపిక్ నడుస్తోంది.


అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య కోసం కొరటాల.. బాలీవుడ్ భామను రంగంలోకి దింపుతోన్నట్లు తెలుస్తోంది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో గ్లామర్ ఒలకబోసే కుర్ర హీరోయిన్ కాకుండా అభినయంతో అలరించే సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ ని ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ – విద్యాబాలన్ జోడీకి మంచి స్పందన వచ్చింది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు.


ఇక దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోందన్న టాక్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతోందట. ఆ కీలక భాగంలోనే విద్యాబాలన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్‌లో మరో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Updated Date - May 08 , 2026 | 07:36 PM