ఎన్టీఆర్ బావ చెప్పాడు.. నీ పరిస్థితి ఏంటి బన్నీ
ABN, Publish Date - Jul 14 , 2026 | 10:11 PM
ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న విషయం టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్ (NTR) రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఈ వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న విషయం టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్ (NTR) రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఈ వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. మొదటి నుంచి తారక్ పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడప్పుడే రాజకీయ రంగప్రవేశం చేసేలా కనిపించడం లేదు. ఆలోపే తిరుపతిలో ఫ్యాన్స్ మీటింగ్, ఊరు-వాడ యాత్ర అని రా ఎన్టీఆర్ అనే సంస్థ ప్రకటించడంతో వెంటనే తారక్ టీమ్ అలర్ట్ అయ్యింది. ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థతో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ తారక్ ఆఫీస్ నుంచి ఒక అధికారిక లేఖను రిలీజ్ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వస్తున్న వార్తలకు పూర్తి స్థాయిలో బ్రేక్ పడింది.
నిజానికి కొన్ని మీడియా సంస్థలు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అని వినగానే ఏకంగా పార్టీ చీలికలు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై కూడా పెద్ద ఎత్తున విశ్లేషణలు చేశాయి. కానీ, తారక్ టీమ్ ఇచ్చిన ఈ పక్కా క్లారిఫికేషన్‌తో ఆ రూమర్లన్నింటికీ ఒక్కసారిగా పుల్‌స్టాప్ పడింది. ఇప్పుడప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో తారక్ అనుకున్న లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. అవన్నీ పూర్తిచేసి కానీ, ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టడు.
ఇక ఎన్టీఆర్ ది అంటే ఎప్పటినుంచో వస్తోన్న వార్తలు.. దానిపై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. కానీ, గత కొన్నిరోజుల నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని, కొత్త పార్టీ పెట్టే యోచనలో భాగంగానే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ను కలిశారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బన్నీ రాజకీయ ఎంట్రీ వార్తలను ఆయన సన్నిహితులు ఇప్పటికే గట్టిగా ఖండించినప్పటికీ, ఎన్టీఆర్ తరహాలో అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి కానీ, బన్నీ కానీ దీనిపై స్పందించలేదు. అవసరం లేదు అనుకున్నాడో.. లేక ఇప్పటివరకు ఈ వార్త ఆయన వరకు చేరలేదో తెలియదు కానీ.. ఇప్పటివరకు దీనిపై అల్లు ఫ్యామిలీ అస్సలు పట్టించుకోలేదు.
అయితే.. ఈ రూమర్స్ పై బన్నీ స్పందిస్తే బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పొలిటికల్ విషయాల్లో అంత ఆలస్యం చేయడం మంచిది కాదు అని, బన్నీ టీమ్ నుంచి కూడా ఇటువంటి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ వస్తే గనుక టాలీవుడ్ స్టార్స్ చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ రూమర్ల గందరగోళానికి ఊహాగానాలకు పూర్తిగా తెరపడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అల్లు అర్జున్ - ఎన్టీఆర్ ఇద్దరూ బావ బావ అని పిలుచుకుంటారు అన్న విషయం తెల్సిందే. దీంతో.. బావ క్లారిటీ ఇచ్చాడు.. నువ్వెప్పుడు ఇస్తావ్ బన్నీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.