సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓ వైపు జ‌న నాయ‌గ‌న్‌, మ‌రోవైపు టాక్సిక్‌.. డైలామాలో 'మెగా 158'

ABN, Publish Date - Apr 22 , 2026 | 12:02 PM

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. హిట్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుంది అంటే చాలు.. రికార్డులు తిరగరాయాల్సిందే అన్నంత హైప్ క్రియేట్ అవుతుంది.

Chiranjeevi

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. హిట్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుంది అంటే చాలు.. రికార్డులు తిరగరాయాల్సిందే అన్నంత హైప్ క్రియేట్ అవుతుంది. సరిగ్గా అలాంటి అంచనాలే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ (Bobby Kolli) కాంబినేషన్‌పై ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది. దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లతో చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తర్వాత, మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ, ఇప్పుడు మెగా 158 ప్రాజెక్ట్ చుట్టూ ఏదో తెలియని ఆందోళన మొదలైంది. అసలు ఈ సినిమా డైలమాలో పడటానికి కారణాలేంటి..?

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) వంటి భారీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. అంతేకాకుండా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, గడిచిన కొద్ది రోజులుగా ఈ నిర్మాణ సంస్థకు కాలం కలిసిరావడం లేదనే చెప్పాలి. ఒకవైపు జననాయగన్ (Jana Nayagan) సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకోవడం, సినిమా లీక్‌ అవ్వడంతో మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కష్టాలకు తోడు.. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో యష్ (Yash) హీరోగా తెరకెక్కిన టాక్సిక్ (Toxic) సినిమా కూడా వాయిదా పడటంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. అసలు మెగాస్టార్ సినిమా ఉంటుందా? లేక ఆగిపోయిందా? అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఊపందుకున్నాయి.

నిజానికి పరిస్థితులు గందరగోళంగా మారినప్పుడే ఈ ప్రాజెక్ట్‌ను వేరే బ్యానర్‌కు హ్యాండోవర్ చేయాలని మెగాస్టార్‌ భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రత్యేక అనుబంధం వల్ల, మేకర్స్ ఆయన్ని రిక్వెస్ట్ చేయడంతో ప్రస్తుతానికి ఈ ఇష్యూ హోల్డ్‌లో ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్క షెడ్యూల్ కూడా షూటింగ్ మొదలు కాకపోవడమే ఈ నెగిటివిటీకి ప్రధాన కారణం. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ చూస్తుంటే, సినిమా షూటింగ్ ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. దీనితో పాటు, కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి అధికారిక అప్‌డేట్ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ హైలెట్‌గా ఉండబోతోందట. వాల్తేరు వీరయ్యలో మాస్ చూపించిన బాబీ, ఇందులో చిరులోని ఎమోషనల్ యాంగిల్‌ను చూపించబోతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ (A. R. Rahman) సంగీతం అందించబోతున్నారు. గతంలోనే సైరా కోసం చిరంజీవి, రెహమాన్ కలవాల్సి ఉన్నా.. ఇతర ప్రాజెక్ట్‌ల వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు మెగా 158తో ఆ కోరిక తీరబోతోందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. సంగీతం పరంగా ఈ సినిమా మరో లెవల్‌లో ఉంటుందని గ్యారెంటీగా చెప్పొచ్చు. కానీ ఎన్ని భారీ హంగులున్నా, షూటింగ్ మొదలైతేనే కదా అసలైన జోష్ వచ్చేది..! సినిమా ఆగిపోయిందన్న రూమర్స్‌కు చెక్ పెట్టాలంటే.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి వెంటనే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మరి మెగాస్టార్ బాబీతో కలిసి మళ్ళీ మ్యాజిక్ చేస్తారా? లేక ఈ ప్రాజెక్ట్ మరికొంత కాలం వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటుందా? అనేది వేచి చూడాలి.

Updated Date - Apr 22 , 2026 | 02:34 PM