ఈ వార్త నిజమైతేనా.. బాక్సాఫీస్ బద్దలే
ABN, Publish Date - Sep 06 , 2026 | 09:22 PM
మన శంకర వరప్రసాద్ గారు హిట్ తో మంచి జోష్ మీదున్న మెగాస్టార్ చిరంజీవితో శివ నిర్వాణ సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ (Irumudi) సినిమా సంచలన విజయం సాధించడంతో, దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana ) పేరు మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది. తనదైన మేకింగ్ స్టైల్, హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఆయన తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నారు. మాస్ రాజా రవితేజ కెరీర్‌కు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందించడమే కాకుండా సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటున్నారంటే, శివ నిర్వాణ రాసిన బలమైన సన్నివేశాలు, మనసును తాకే మాటలే ప్రధాన కారణం. ఈ అద్భుతమైన సక్సెస్‌తో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఈ భారీ విజయం ఇచ్చిన జోష్‌తో, సినీ వర్గాల్లో ఇప్పుడు ఒకే ఒక్క ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే తాజాగా మన శంకర వరప్రసాద్ గారు హిట్ తో మంచి జోష్ మీదున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో శివ నిర్వాణ సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్‌లోని అద్భుతమైన కామెడీ టైమింగ్, తిరుగులేని మాస్ ఇమేజ్‌ను ఒక కొత్త కోణంలో ప్రజెంట్ చేయడంలో శివ నిర్వాణ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. చిరు స్క్రీన్ ప్రెజెన్స్‌కు శివ నిర్వాణ మార్క్ ఎమోషనల్ టేకింగ్ తోడైతే, సిల్వర్ స్క్రీన్ మీద ఒక సరికొత్త రికార్డులు సృష్టించే మ్యాజిక్ క్రియేట్ అవ్వడం ఖాయం.
ఇప్పటివరకు శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాలు ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అచ్చం అలాంటి భావోద్వేగాలనే మెగాస్టార్ వంటి మాస్ హీరో ఇమేజ్‌తో మిక్స్ చేస్తే వచ్చే కిక్కే వేరు. కేవలం యాక్షన్, డాన్సులు మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కదిలించే బలమైన కుటుంబ ఎమోషన్స్ ఉన్న కథ పడితే ఆ సినిమా స్థాయి వేరే లెవెల్‌లో ఉంటుంది.
చిరంజీవి ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో కాకా అనే మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న కాకా సంక్రాంతి టార్గెట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తరువాత శ్రీకాంత్ ఓదెలతో ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశముంది. అయితే ఈ ప్రాజెక్ట్ కన్నా ముందే శివ నిర్వాణ ప్రాజెక్ట్ చేస్తారా..లేక అది రూమర్స్ కే పరిమితమవుతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఒక వేళ చిరంజీవి-శివనిర్వాణ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్ అయితే మాత్రం మెగా అభిమానులకు అది పండగ లాంటి వార్త అవుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయిని మరోసారి పైకి తీసుకెళ్లే సత్తా ఈ కలయికకు ఉంది. మరి ఇద్దరి పవర్ ట్యాగ్‌తో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో లేదో చూడాలి!