16 ఏళ్ల తర్వాత మళ్లీ 'రక్త చరిత్ర 2.'. ట్రైలర్ రిలీజ్
ABN, Publish Date - Jul 23 , 2026 | 08:13 PM
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర 2 మూవీ 16 ఏళ్ల తర్వాత ఆగస్టు 1న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.
ర్చకు దారితీసిన ఈ చిత్రం, దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆగస్టు 1న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. సూర్య పుట్టినరోజు సందర్భంగా గురువారం చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, క్వీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లపై వంకాయపాటి మురళీకృష్ణ, నట్టి లక్ష్మి కరుణ, నట్టి క్రాంతి ఈ చిత్రాన్ని ఆగస్టు 1న రీ రిలీజ్ చేస్తున్నారు.
రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన 'రక్త చరిత్ర 2'లో సూర్య, వివేక్ ఒబెరాయ్, ప్రియమణి, రాధికా ఆప్టే కీలక పాత్రలు పోషించారు. రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కథను తెరపై ఆవిష్కరించిన తీరు అప్పట్లో ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. ఇటీవల రీ రిలీజ్ అయిన 'రక్త చరిత్ర పార్ట్ 1' ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడంతో, ఇప్పుడు రెండో భాగాన్ని కూడా థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ సినిమాను పెద్ద తెరపై చూసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.