స్పిరిట్.. 13 ఏళ్ళ తరువాత ప్రభాస్ రీల్ తల్లి ఎంట్రీ

ABN , Publish Date - Jun 02 , 2026 | 09:24 PM

ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. ప్రభాస్(Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో టి.సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Spirit

ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. ప్రభాస్(Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో టి.సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఆడియో టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి.


ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొంపల్లి, విమల్ థియేటర్ వంటి పరిసర ప్రాంతాల్లో స్పిరిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటి నదియా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. 2013లో విడుదలై ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మిర్చి సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా నటించి మెప్పించింది నదియా. ఆ సినిమాలో తల్లీకొడుకుల మధ్య బాండింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అప్పట్లో వీరిద్దరి కాంబోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఇక దాదాపు 13 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ కానుంది.


అయితే నదియా ఈసారి కూడా ప్రభాస్ కి తల్లిగానే నటిస్తోందా.. ? లేక వేరే పాత్రలో నటిస్తోందా.. ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాదు యావత్ ఇండస్ట్రీ ఎన్నో అంచనాలను పెట్టుకుంది. ఇక ఈ గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్, 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Updated Date - Jun 02 , 2026 | 09:32 PM