సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

G2 Movie: పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్‌ డేట్ లాక్డ్!

ABN, Publish Date - Sep 16 , 2026 | 04:11 PM

అడివి శేష్‌ తాజా చిత్రం 'జి 2' వచ్చే యేడాది ఫిబ్రవరి 5న విడుదలకు సిద్థమౌతోంది. వామికా గబ్బి, సుప్రియ యార్లగడ్డ, మధుశాలిని ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Adivi Sesh G 2 Movie

అడివి శేష్‌ నటించిన 'డెకాయిట్‌' మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో కొంతకాలం గ్యాప్‌ తీసుకున్న శేష్‌ ఇప్పుడు మరోసారి తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'జి2' దృష్టి పెట్టాడు. గతంలో విడుదలై విజయం సాధించిన 'గూఢచారి'కి ఇది సీక్వెల్‌. నిజానికి ఈ సినిమా ఈ యేడాది మే 1న విడుదల కావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల మూవీ షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది.


వినయ్‌ కుమార్‌ సిరిగినీడి 'జి 2' సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫస్ట్ పార్ట్ 'గూఢచారి' సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఈ దీనిని నిర్మిస్తున్నారు. 150 రోజుల పాటు, 6 దేశాల్లో షూటింగ్ చేసి, 23 భారీ సెట్లతో తెరకెక్కించిన ఈ మూవీ, ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్‌ ని రీడిఫైన్ చేయనుంది. ఇందులో ఏజెంట్‌ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల వచ్చిన 'డీసీ' చిత్రం నటిగా వామికా గబ్బికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో 'జి2'లో ఆమె పోషించే గూఢచారి పాత్రపై కూడా బజ్ క్రియేట్‌ అవుతోంది. అలానే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మి 'జీ2'లో నటిస్తున్నాడు. నిజానికి ఇదే అతని మొదటి తెలుగు సినిమా. అయితే ఈ సినిమా నిర్మాణం ఆలస్యం కావడంతో ఇమ్రాన్ హష్మి తెలుగువారి ముందుకు 'ఓజీ' మూవీతో వచ్చాడు. ఆ సినిమా ఘన విజయం సాధించడం కూడా 'జీ2'కు కలిసి వచ్చే అంశమే. ఇతర ప్రధాన పాత్రలను మురళీశర్మ, సుప్రియా యార్లగడ్డ, మధుశాలిని పోషిస్తున్నారు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ 'జి 2' సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది. ఈసారి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని 2027 ఫిబ్రవరి 5న విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Updated Date - Sep 16 , 2026 | 04:19 PM