సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dacoit: ధురంధర్ దెబ్బ.. తప్పుకున్న డెకాయిట్

ABN, Publish Date - Feb 03 , 2026 | 03:46 PM

ఒకప్పుడు ఒక సినిమా వాయిదా పడింది అంటే అది అపశకునం అని ఫీల్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు అది ఒక ట్రెండ్ గా మారిపోయింది. మేకర్స్ చెప్పిన టైమ్ కి సినిమా రిలీజ్ అయితే అదే విశేషంగా మారుతోంది.

Dacoit

Dacoit: ఒకప్పుడు ఒక సినిమా వాయిదా పడింది అంటే అది అపశకునం అని ఫీల్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు అది ఒక ట్రెండ్ గా మారిపోయింది. మేకర్స్ చెప్పిన టైమ్ కి సినిమా రిలీజ్ అయితే అదే విశేషంగా మారుతోంది. కొన్ని సినిమాలు అయితే వాయిదాల మీదనే నడుస్తున్నాయి అని చెప్పొచ్చు. అలాంటి సినిమాల లిస్ట్ లో డెకాయిట్ (Dacoit) కూడా చేరింది. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా షానెయిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది. ఇక ఈ మూవీలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తోంది. ఇప్పటికే డెకాయిట్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ కూడా పెంచేశాయి.

అన్ని బావుండి ఉంటే డెకాయిట్ గతేడాది క్రిస్మస్ కే రావాల్సింది. కానీ, మొదట హీరోయిన్ గా నటించిన శ్రుతి తప్పుకోవడం, ఆ సీన్స్ ని మళ్ళీ మృణాల్ తో చేయించడంతో లేట్ అయ్యింది. అంతా ఓకే అనుకోని షూటింగ్ మొదలుపెట్టిన కొన్నిరోజులకే శేష్ కి సెట్ లో ప్రమాదం జరగడం, రెస్ట్ తీసుకోవడంతో షూటింగ్ ఫినిష్ కాలేదు. దీంతో క్రిస్మస్ నుంచి సమ్మర్ కి వాయిదా వేశారు. మార్చి 19 న పక్కాగా వస్తామని శేష్ బల్లగుద్ది మరీ చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ డేట్ నుంచి కూడా డెకాయిట్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

డెకాయిట్ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. దానికి కారణం మార్చి 19 నే పాన్ ఇండియా సినిమా ధురంధర్ 2 రిలీజ్ కానుంది. గతేడాది రిలీజ్ అయిన ధురంధర్ పార్ట్ 1 భారీ విజయాన్ని అందుకుంది. సెకండ్ పార్ట్ పై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇదే కాకుండా అదే రోజున యష్ టాక్సిక్ కూడా రానుంది. మొదట టాక్సిక్ కూడా వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ, అనుకున్న సమయానికే యష్ వస్తున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు పెద్ద సినిమాల మధ్య నలిగిపోవడం ఎందుకని, డెకాయిట్ పక్కకి జరిగినట్లు టాక్. మార్చి 19 పోతే ఇంకెప్పుడు డెకాయిట్ వస్తోంది అంటే ఏప్రిల్ 10 న వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇక ఈ విషయం తెలియడంతో శేష్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి.

Updated Date - Feb 03 , 2026 | 03:46 PM