శేష్ సినిమా హిట్టా ఫట్టా! ఎంత పెట్టారు.. ఎంత వచ్చాయంటే!
ABN, Publish Date - Apr 14 , 2026 | 04:44 PM
అడివి శేష్ ప్రతి సినిమాపై ఒక ప్రత్యేకమైన క్యూరియాసిటీ ఉంటుంది. తాజాగా విడుదలైన డెకాయిట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.
టాలీవుడ్‌లో కంటెంట్ నమ్ముకుని, వరుస సక్సెస్‌లతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). క్షణం నుంచి మొన్నటి మేజర్, హిట్-2 వరకు శేష్ సినిమా అంటే ఏదో ఒక వైవిధ్యం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమాపై ఒక ప్రత్యేకమైన క్యూరియాసిటీ ఉంటుంది. తాజాగా విడుదలైన డెకాయిట్ (Dacoit) ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే గతంలో వచ్చిన శేష్ సినిమాలతో పోలిస్తే డెకాయిట్ సినిమా టాక్ మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వస్తుందా లేదా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
గత కొన్నేళ్లుగా శేష్ ఫ్లాప్ అనేది ఎరుగని హీరోగా దూసుకుపోతున్నారు. అయితే డెకాయిట్ సినిమాకు మాత్రం మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన లభించింది. కథలోని ఎమోషన్స్ కొన్ని వర్గాలకు నచ్చినా, మరికొందరికి మాత్రం స్లో నెరేషన్ అనే ఫీలింగ్ కలిగింది. సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ వద్దకు వచ్చిన సినిమాల్లో మళ్ళీ ఆ స్థాయిలో హడావిడి కనిపించలేదు. ఈ మధ్యలో వచ్చిన రాకాస, బైకర్ వంటి చిత్రాలు డీసెంట్ హిట్స్ అనిపించుకున్నా, శేష్ సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా డెకాయిట్ పై అందరి దృష్టి పడింది.
అయితే.. సినిమా ఫలితాన్ని కేవలం థియేటర్ కలెక్షన్లతోనే లెక్క కట్టలేం. డెకాయిట్ సినిమా మేకర్స్ ఒక విషయంలో చాలా సేఫ్ గా ఉన్నారు. అదే నాన్-థియేట్రికల్ బిజినెస్. అడివి శేష్ సినిమాలకు హిందీ మార్కెట్ మరియు OTT లలో మంచి డిమాండ్ ఉండటంతో డిజిటల్ రైట్స్ ద్వారా మేకర్స్ ఇప్పటికే భారీ మొత్తాన్ని వెనకేశారు. నిర్మాణ పరంగా చూస్తే, మేకర్స్ ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరయ్యారనేది ట్రేడ్ టాక్. నిర్మాతలు సేఫ్ అయినా, బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే థియేట్రికల్ కలెక్షన్స్ ముఖ్యం. సినిమా.. కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ, శేష్ మునుపటి సినిమాల రేంజ్‌లో మాత్రం లేవు.
దీనికి ప్రధాన కారణం మిక్స్‌డ్ టాక్, మండిపోతున్న ఎండలు, థియేటర్లపై ప్రజల్లో మక్కువ తగ్గడం కావచ్చు. అయితే డెకాయిట్ సినిమా వద్దకు వచ్చే సరికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఈ చిత్రం నాన్-థియేట్రికల్ హక్కులు ( (ఓటీటీ, సాటిలైట్, డిజిటల్) ద్వారా ఇప్పటికే రూ.48 కోట్లు వసూలై సగం సపెట్టుబడి రాబట్టడం మేకర్స్‌ను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లింది. ఇక సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థే స్వయంగా నిజాం, ఉత్తరాంధ్ర వంటి కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేసింది. కాబట్టి థియేట్రికల్ రన్ నుంచి వచ్చే ప్రతి రూపాయి మేకర్స్ కే వెళ్తుంది.
సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డెకాయిట్ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.20 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంది. వీకెండ్ ముగిసి ఐదవ రోజుకి (మంగళవారం) వచ్చే సరికి ఈ చిత్రం రెండు వెర్షన్లు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ దక్కించుకోగా రూ.18 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ వసూలు చేసింది. మిగిలిన ఈ వారాంతానికి మరో రెండు కోట్లు సంపాదిస్తే సూపర్ హిట్ జాబితాలో చేరే అవకాశం ఉంది.
ఓవరాల్ గా చూస్తే.. డెకాయిట్ సినిమా అడివి శేష్ మార్కెట్ స్టామినాను మరోసారి నిరూపించింది. టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రాబట్టడంలో శేష్ సక్సెస్ అయ్యారు. నాన్-థియేట్రికల్ పరంగా సినిమా సేఫ్ జోన్‌లో ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే రాబోయే రోజుల్లో నిలకడైన వసూళ్లను రాబట్టాలి. మరి సెకండ్ వీకెండ్ నాటికి ఈ డెకాయిట్ బాక్సాఫీస్ ను ఎంతవరకు కొల్లగొడతాడో చూడాలి!