సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బ్రేకప్.. కోలుకోవడానికి పదేళ్లు పట్టింది- అడివి శేష్

ABN, Publish Date - Apr 07 , 2026 | 04:54 PM

నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు, దాని నుంచి కోలుకోవడానికి దాదాపు పదేళ్ళు పట్టిందని అన్నారు హీరో అడివి శేష్. ఆయన హీరోగా రూపుదిద్దుకుంటోన్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ‘డెకాయిట్‌’. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Hero Adivi Sesh

నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు, దాని నుంచి కోలుకోవడానికి దాదాపు పదేళ్ళు పట్టిందని అన్నారు హీరో అడివి శేష్ (Adivi Sesh). ఆయన హీరోగా రూపుదిద్దుకుంటోన్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ‘డెకాయిట్‌’ (Dacoit). షానియల్ డియో (Shaneil Deo) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు.


‘‘నా గత సినిమాల్లో ఒక బిగ్ ప్లాట్‌ఫామ్ చేరుకోవడానికి లవ్ స్టోరీ వుంటుంది. కథలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉంటుంది. కానీ ఈ ‘డెకాయిట్’‌లో లవ్ స్టోరీ‌నే మెయిన్ ప్లాట్ ఫామ్. ఈ మొత్తం సినిమాకి ప్రాణం లవ్ స్టోరీనే. ఒక లవ్ స్టోరీలో యాక్షన్ చూడడానికి ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాతో ఫుల్ హ్యాపీ అవుతారు. అదే సమయంలో ఒక యాక్షన్ సినిమాలో లవ్ స్టోరీ చూడడానికి వెళ్తే మాత్రం డిజప్పాయింట్ అవుతారు. ఇందులో ఎమోషన్స్ అన్నీ కూడా చాలా ఆర్గానిక్‌గా ఉంటాయి. మొదటి నుంచి నాకు బ్రోకెన్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందుకే ‘దేవదాస్’ సినిమాని మనం ఎన్ని సార్లు అయినా చూస్తాం. నేను రాసిన ప్రతి సినిమాలో నా లైఫ్‌లో జరిగిన విషయాలు కచ్చితంగా కొన్ని ఉంటాయి. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు ఏం అర్థం కాలేదు. అప్పుడు నాకు కేవలం 19 ఏళ్ళు. ఆ బ్రేకప్ నుంచి బయటపడడానికే నాకు దాదాపు పదేళ్లు పట్టింది. అందులో రెండు సంవత్సరాలు నాకసలు ఏం అర్థం కూడా కాలేదు. ఆ ఎమోషన్‌ని ఈ సినిమాలో హరి పాత్ర ద్వారా చూపించేందుకు ట్రై చేశాను’’ అని అడివి శేష్ తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 04:57 PM