‘అదే నీవు అదే నేను’ మూవీ సాంగ్ వదిలిన స్టార్ డైరెక్టర్
ABN , Publish Date - Jul 13 , 2026 | 07:37 PM
త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా ‘అదే నీవు అదే నేను’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు.
త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా ‘అదే నీవు అదే నేను’ (Ade Neevu Ade Nenu). ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘మనసా మనసా’ (Manasa Manasa) అంటూ సాగే సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ (VV Vinayak) విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ మూవీ పాటలు మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి. తమ మూవీలోని సాంగ్‌ను విడుదల చేసి.. తమకు సపోర్ట్ ఇచ్చిన దర్శకుడు వినాయక్‌కు ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల, డైరెక్టర్ కొండల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు కొండల్ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తూ ‘అదే నీవు అదే నేను’ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఆయనకు మంచి పేరు, గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. గోవింద్‌కు కూడా నిర్మాతగా తొలి చిత్రమిది. ప్రొడ్యూసర్‌గా ఆయన కూడా విజయాన్ని అందుకుని, మరిన్ని మంచి మూవీస్ చేయాలి. ‘మనసా మనసా’ సాంగ్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
ఇక ఈ చిత్రంలోని ‘మనసా మనసా’ పాట విషయానికి వస్తే.. డైరెక్టర్ కొండల్ ఈ పాటను బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. ఈ పాట రొమాంటిక్‌గా సాగుతూనే.. ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా.. చాలా సెన్సిబుల్‌గా, పొయెటిక్‌గా రూపొందించడం విశేషం. ఈ పాటకు ‘ఎన్నెన్నె ఎన్నెన్నె వర్ణాలు ఉన్నా, నువు లేని వెలితేదో మిగిలున్నదే, ఇన్నాళ్లకైనా నిన్ను చూశాను అన్న ఆనందం నా సొంతమే...’ అనే లిరిక్స్‌తో ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంది. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క రిపీటెడ్‌గా వినేలా మంచి ట్యూన్‌తో ఈ పాటను కంపోజ్ చేయగా.. టాప్ సింగర్ జావెద్ అలీ తన సహజమైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. ఈ పాటలో హీరో హీరోయిన్స్ త్రినాథ్ వర్మ, తన్వీ నేగి మధ్య కెమిస్ట్రీ చూడచక్కగా ఉందని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
పెదనాన్న అంటూ చిరుకి అఖిల్ రిప్లై.. సోషల్ మీడియా తగలడిపోతోంది
‘లెనిన్’ 3 డేస్ కలెక్షన్స్.. అయ్యగారు ఫిఫ్టీ ప్లస్ నాటౌట్.. ఇక సెంచరీనే!
‘జురాసిక్ పార్క్’ డాక్టర్ అలన్ గ్రాంట్ కన్నుమూత