Raviteja: అద్దంముందు నిలబడి.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
ABN , Publish Date - Jan 29 , 2026 | 07:11 PM
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి అద్దం ముందు నిలబడి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.
రవితేజ (Ravi Teja), డింపుల్ హయతీ (Dimple Hayathi), అషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా ఇటీవల థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). తిరుమల కిశోర్ (Kishore Tirumala) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణను దక్కించుకుంది.
అయితే.. తాజాగా ఈ సినిమాలో మంచి ప్రాచుర్యం పొందిన అద్దం ముందు నిలబడి అబద్దం చెప్పలేనే (Addham Mundhu) అంటూ సాగే బ్యూటీఫుల్ మెలోడీ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించిన ఈ గీతాన్ని బీమ్స్ సిసిరిలియో (Bheems Ceciroleo) సంగీతంలో శ్రేయా ఘోషాల్ (Shreya Ghoshal), కపిల్ కపిలన్ (Kapil Kapilan) ఆలపించారు. కాగా పాట విడుదలైన నిమిషాల వ్యవధిలోనే భారీ వ్యూస్ రాబడుతోంది.