Irumudi: మంచి ఛాన్స్.. మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:23 PM
మాస్ మహారాజా రవితేజ , శివ నిర్వాణ తొలి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇరుముడి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తొలి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇరుముడి (Irumudi) చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. తాజాగా చిత్ర బృందం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రవితేజ కొత్త లుక్‌తో కనిపించడంతో పాటు చిన్నారి నక్షత్ర (Nakshatra) కూడా కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తయిందని, మిగిలిన స్వల్ప ప్యాచ్‌వర్క్ అనంతరం సినిమా పూర్తిగా సిద్ధమవుతుందని చెప్పినట్టుగానే ఆగస్టు 21న థియేటర్లలోకి వస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
'ఇరుముడి'లో రవితేజను ఇప్పటివరకు చూడని కోణంలో చూపించబోతున్నట్లు సమాచారం. అయ్యప్ప స్వామి భక్తుడిగా, తన కూతురిపై అపారమైన ప్రేమ కలిగిన తండ్రిగా ఆయన పాత్ర ఉండనుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) కథానాయికగా నటిస్తుండగా, చిన్నారి నక్షత్ర కూతురు పాత్రలో కనిపించనుంది. సీనియర్ నటుడు సాయి కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ప్రతిచోటా ఆ పాటే మారుమ్రోగుతోంది.
ఇదిలా ఉంటే.. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను మొదట నాగచైతన్య (Naga Chaitanya) కు వినిపించినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన మజిలీ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ అనంతరం దర్శకుడు శివ తొలుత చైతన్యను కలిసి ఈ స్క్రిప్ట్ వినిపించాడని, అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో చైతన్య తప్పుకుని చివరకు ఈ ప్రాజెక్ట్ రవితేజ వద్దకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోండగా నాగ చైతన్య మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయం నమోదు చేసుకుంటుందో.
ఇవి కూడా చదవండి:
Sakshi Agarwal: చిరకాల స్వప్నం సాకారమైంది
రకుల్, కాజల్ ముందు సాయి పల్లవి వేస్ట్..
Mamitha Baiju: మమిత జోరు మాములుగా లేదు.. అసలు తగ్గట్లేదుగా