సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తమ్ముళ్లతో రొమాన్స్.. అన్నలతో పెళ్లి

ABN, Publish Date - Sep 01 , 2026 | 05:05 PM

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్‌లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్‌లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Heroines

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్‌లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్‌లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా నటి కావ్య కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ ఆసక్తికరమైన అంశం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ తమ్ముడైన యంగ్ హీరో శ్రీసింహా కోడూరి సరసన ఉస్తాద్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత కాల భైరవతో ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్తోంది. ఇక గతంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన జంటలు టాలీవుడ్, కోలీవుడ్‌లలో వార్తల్లో నిలిచాయి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ సరసన మిస్టర్ ఇండియా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య, నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.


ఇదే వరుసలో నటి శ్రియా రెడ్డి కూడా విశాల్ సరసన పొగరు చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో విశాల్ - శ్రియా రెడ్డి రొమాంటిక్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ సెట్ లో శ్రియాకు విశాల్ అన్నయ్య, నిర్మాత విక్రమ్ కృష్ణ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలాగే సోనియా అగర్వాల్, ధనుష్ సరసన కాదల్ కొండేన్ చిత్రంలో నటించి, ఆ తర్వాత ఆ సినిమా దర్శకుడు, ధనుష్ అన్నయ్య అయిన సెల్వరాఘవన్‌ను వివాహం చేసుకుంది. కొన్ని విభేదాల వలన ఈ జంట కొన్నాళ్ళకే విడిపోయారు. ఇలా తెరపై తమ్ముళ్లతో జోడీ కట్టి, జీవితంలో అన్నలకు భాగస్వాములుగా మారిన ఈ హీరోయిన్ల రియల్ లైఫ్ లవ్ స్టోరీలు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - Sep 01 , 2026 | 05:05 PM