సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాకు పిల్లలంటే ఇష్టం లేదు.. నేను కనను.. బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన వరలక్ష్మి!

ABN, Publish Date - Oct 12 , 2026 | 03:34 PM

సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న మూడు నెలల తరువాత అందరూ అడిగే సాధారణ ప్రశ్న.. గుడ్ న్యూస్ ఎప్పుడు అని. అందుకు హీరోయిన్స్ కూడా మినహాయింపు కాదు.

Varalaxmi sarathkumar

సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న మూడు నెలల తరువాత అందరూ అడిగే సాధారణ ప్రశ్న.. గుడ్ న్యూస్ ఎప్పుడు అని. అందుకు హీరోయిన్స్ కూడా మినహాయింపు కాదు. పెళ్లి తరువాత హీరోయిన్ మీడియా ముందకు వస్తే చాలు.. ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. దానికి వారు ఏదైనా ఉంటే తామే చెప్తామని చెప్పి సిగ్గు పడుతుంటారు. కానీ, టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ఎప్పుడూ తన బోల్డ్ స్టేట్‌మెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాను ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతానని మరోసారి నిరూపించింది. తాజాగా పిల్లల కనడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పెళ్లయిన ప్రతి దంపతులు కచ్చితంగా పిల్లలను కనాలని ఎక్కడా ఎలాంటి రూల్ లేదని ఖరాకండీగా చెప్పేసింది.


మొదట్లో పెళ్లి వద్దు సింగిల్ గా ఉండిపోతాను అని చెప్పిన వరలక్ష్మీ.. 2024 లో నికోలాయ్ సచ్ దేవ్ ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి అయ్యి రెండేళ్ళు అవుతుండడంతో చాలామంది ఆమెను పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని అడగడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఆమె ఈ విషయమై కుండ బద్దలు కొట్టేసింది. అసలు తనకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. 'పిల్లలు పుట్టరని కాదు.. పుట్టించలేమని కాదు.. అసలు నాకు పిల్లలను కనాలనిపించడం లేదు' అంటూ ఆమె చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది.


సమాజంలో వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు ఉండాలనే ఒక మూస పద్ధతికి భిన్నంగా ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్‌కుమార్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏ విషయంలోనైనా తన మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వరలక్ష్మి శరత్‌కుమార్ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటి భవిష్యత్ లోనైనా తల్లిగా మారుతుందో లేదో చూడాలి.

Updated Date - Oct 12 , 2026 | 03:34 PM