Renu Desai: ఇష్టమొచ్చినట్లు.. వైరల్, ట్రోల్ చేస్తున్నారు! అంతా.. ప్రభాస్ కలియుగంకు వెళ్లాల్సిందే
ABN, Publish Date - Jan 22 , 2026 | 10:07 PM
ప్రముఖ నటి రేణు దేశాయ్ (Renu Desai) ఇటీవల ప్రెస్‌మీట్‌లో కుక్కల విషయంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
ప్రముఖ నటి రేణు దేశాయ్ (Renu Desai) ఇటీవల ప్రెస్‌మీట్‌లో కుక్కల విషయంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గడిచిన రెండు రోజులుగా ఈ అంశం అన్నీ మీడియాల్లో ప్రధాన వార్తగా హాల్‌చల్ అవుతోంది. అనేక మంది రేణు దేశాయ్‌పై విమర్వలు కురిపిస్తుండగా మరి కొంతమంది మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన గత ప్రెస్మీట్ నేపథ్యంలో జరుగుతున్న రాద్ధాంతంపై స్పందించారు. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో 13 నిమిషాలకు పైగా నిడివితో ఉండడం విశేషం.
విషయానికి వస్తే.. ఇటీవల నేను సమావేశం ఏర్పాటు చేసి 30 నిమిషాలకు పైగా మాట్లాడితే.. చాలామంది దానిలో ఎవరికి కావాల్సింది వారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వారికి ఇష్టం వచ్చిన రీతిలో వైరల్ చేస్తు ఇష్యూను తప్పుదోవ పట్టించి నన్ను ట్రోల్ చేయిస్తున్నారని వాపోయారు. మనుషులు, యానిమల్స్ అంతా బావుండాలి గానీ.. కొన్ని కుక్కలు ఇబ్బంది పెట్టాయని అన్నింటినీ అలా చంపడం భావ్యం కాదు అని చెప్పడమే నా ఉద్దేశం అన్నారు.
కుక్కలు, పిల్లులు, కోతులు అన్నీ ఒకరోజు పోతాయి. ఏదో ఒకరోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే నని మన జీవితం తాత్కాలికమేనని గుర్తుచేశారు. మనిషి ఎప్పటికీ శాశ్వతం కాదని, ప్రతి ఒక్కరూ ఒకరోజు వెళ్లిపోవాల్సిందే అంటూ ఆగ్రహంతో తెలిపారు. అంతేగాక ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమాను ప్రస్తావిస్తూ, “ప్రభాస్ కల్కి మూవీ చూశారా..? అదే కలియుగం” ఎలాగైనా అక్కడికి వెళ్తాం ప్రశాంతంగా ఉండండి.. మంచిగా ఉండండి అంటూ హెచ్చరించారు. తాజాగా రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.