పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సామజవరగమనా హీరోయిన్..
ABN, Publish Date - Jul 28 , 2026 | 08:45 PM
తెలుగులో సామజవరగమనా చిత్రంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది.
తెలుగులో సామజవరగమనా చిత్రంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. జూలై 22న ఆమె ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ, తన ముద్దుల కూతురి పేరు కియారా జోసెఫ్ (Kiara Joseph) అని కూడా చెప్పుకొచ్చింది. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పోస్ట్‌లో రెబా మోనికా జాన్ స్పందిస్తూ.. "హలో వరల్డ్, మా చిన్నారి కియారా జోసెఫ్‌కి హాయ్ చెప్పండి. తను మా జీవితాల్లోకి వచ్చిన చిన్న సూర్యకిరణం. గడిచిన కొద్ది రోజులుగా కొత్త అనుభూతిని ఆస్వాదిస్తూ, ఈ బుజ్జి మనిషిని అర్థం చేసుకునే పనిలో ఉన్నాం. మన శరీరం మరొక ప్రాణానికి జన్మనివ్వడం ఒక అద్భుతం. గత 9 నెలలుగా తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
తన భర్త జోయిస్టన్ క్రిస్టోఫర్‌తో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ప్రపంచాన్ని తన కూతురికి తమ దృష్టితో చూపించడానికి, ముగ్గురితో కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి వేచి చూడలేకపోతున్నామని తెలిపింది. తమ జీవితంలోని ఈ కొత్త అధ్యాయానికి అందరి ఆశీస్సులు కావాలని వారు కోరారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.