సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashi Singh: మేకప్ లేకుండా.. నటించా

ABN, Publish Date - Jun 19 , 2026 | 07:20 AM

నాకు చదువులో పెద్ద ఆసక్తి ఉండేది కాదు.. 14 ఏళ్లకే మోడలింగ్ మొదలు పెట్టాన‌ని న‌టి రాశీ సింగ్ అన్నారు.

Rashi Singh

"సినిమాలు, వ్యాపారం రెండూ నాకు ఇష్టమే. 14 ఏళ్లకే మోడ లింగ్ మొదలు పెట్టా. నాకు చదువులో పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలా మెల్లిగా ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ మొదలుపెట్టాను. నాకు ఫుడ్, కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే రెస్టారెంట్ బిజినెస్ పెట్టా. మా బ్రదర్ హోటల్ మేనేజ్ మెంట్ చేశారు. అతని సలహాలు కూడా తీసుకున్నా. రెస్టారెంట్ బాగా నడుస్తోంది' అన్నారు రాశీ సింగ్ (Rashi Singh).

వడ్డే నవీన్ నటించి, నిర్మించిన ట్రాన్స్‌పర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu)లో ఆమె హీరోయిన్‌గా నటించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో రాశీ మీడియాతో ముచ్చటించారు. 'ఇందులో నాది పక్కింటి అమ్మా యిలాంటి పాత్ర. మేకప్ లేకుండా నటించా.

కుటుంబం చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ ఇది. భర్తకు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉండే గృహిణి పాత్ర నాది. కొన్ని సందర్భాల్లో చిరాకు పడినా ఎప్పుడూ భర్తకు అండగా నిలిచే పాత్ర ఇది. నా కెరీర్ లో ఇదో విభిన్న పాత్ర' అని చెప్పారు రాశీ.

'షూటింగ్ సమయంలో నాకు పూర్తి కథ తెలీదు. నా సీన్స్ వరకూ చెప్పారు. మొత్తం సినిమా చూసి ఆశ్చర్య పోయా. నవీన్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదొక మంచి సినిమా అవుతుంది' అని చెప్పారు.

Updated Date - Jun 19 , 2026 | 07:25 AM