సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Actress Prema: సౌందర్య డెడ్‌బాడీకి తల లేదు.. వాచ్ చూసి గుర్తుపట్టాం

ABN, Publish Date - Sep 15 , 2026 | 06:11 PM

అందాల భామ నటి ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1990ల్లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా అలరించిన ప్రేమ కన్నడలో శివరాజ్‌కుమార్ సరసన ఓం సినిమాతో సినీ రంగప్రవేశంచేసింది.

Prema

అందాల భామ నటి ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1990ల్లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా అలరించిన ప్రేమ (Prema) కన్నడలో శివరాజ్‌కుమార్ సరసన ఓం సినిమాతో సినీ రంగప్రవేశంచేసింది. ఆ తరువాత తెలుగులో వెంకటేష్ సరసన నటించిన ధర్మచక్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా దేవి ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యింది. దేవి తరువాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుకుంది ప్రేమ.


గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న నటి ప్రేమ, ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటూ తన వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యాపారాలపై దృష్టి సారించింది. సినిమా అవకాశాలకు కాస్త విరామం ఇచ్చినప్పటికీ, టీవీ షోలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ, సినిమాల్లో సరైన పాత్రలు వస్తే మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొస్తుంది.


ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రేమ తన ఆప్తమిత్రురాలు, దివంగత నటి సౌందర్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. తామిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, కలిసి 4 సినిమాలు చేశామని, షూటింగ్ అయిపోగానే ఒకరి రూమ్‌కి ఒకరం వెళ్లి సరదాగా గడిపేవాళ్లమని, బెంగళూరులో ఉన్నప్పుడు సౌందర్య వల్ల తనకు ఫ్లైట్‌లు కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. సౌందర్య ఘోర విమాన ప్రమాదంలో మరణించిందనే వార్త విని తీవ్రంగా దిగ్భ్రాంతి చెందానని ఆమె ఎమోషనల్ అయ్యింది.


అంతేకాకుండా, ప్రమాదం జరిగిన తర్వాత సౌందర్య భౌతికకాయాన్ని చూసిన దృశ్యం తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రమాద తీవ్రత వల్ల బాడీకి తల కూడా లేదని, చేతికి ఉన్న వాచ్ ఆధారంగానే అది సౌందర్య అని గుర్తుపట్టాల్సి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యింది. ఆ ఘోర దృశ్యం చూసిన తర్వాతే మనిషి ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మనతో ఏదీ రాదు అనే జీవిత సత్యాన్ని గ్రహించానని భావోద్వేగంతో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Sep 15 , 2026 | 06:19 PM