సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ..

ABN, Publish Date - Mar 14 , 2026 | 03:36 PM

నటి పూర్ణ (షమ్నా ఖాసీం) మరోసారి అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

నటి పూర్ణ (Poorna-షమ్నా ఖాసీం) మరోసారి అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఉదయం 4.25 గంటలకు ఆడబిడ్డకు (Baby girl) జన్మనిచ్చినట్లు పూర్ణ దంపతులు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ఆ అల్లాహ్‌ ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు దక్కిన అపురూపమైన కానుక. ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ అయింది. అందుకు భగవంతుడికి, ఆస్పత్రి బృందానికి ధన్యవాదాలు’ అని పోస్ట్‌లు పేర్కొన్నారు. (actress Poorna)

‘శ్రీమహాలక్ష్మీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూర్ణ ‘సీమ టపాకాయ్‌’తో మంచి గుర్తింపు పొందింది. అవును, లడ్డూ బాబు, నువ్వలా నేనిలా, అవును 2, జయమ్ము నిశ్చయమ్మురా, సిల్లీ ఫెలోస్‌, దసరా, తీస్‌ మార్‌ ఖాన్‌, అఖండ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ నటి అయినప్పటికీ అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మారిపోయింది. సినిమాలతో మంచి బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త షానిద్‌ ఆసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుంది. 2023లో ఈ జంటకు హమ్‌దన్‌ ఆసిఫ్‌ అలీ అనే బాబు పుట్టాడు. ఇక గతేడాది ఆగస్టులో మరోసారి గర్భం దాల్చింది పూర్ణ. ఇప్పుడు ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సహ నటీనటులు, సన్నిహితులు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. 

Updated Date - Mar 14 , 2026 | 03:59 PM