సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Meenakshi Chaudhary: కాలిన‌డ‌క‌న‌.. స్వామి వారిని ద‌ర్శించుకున్న‌ మీనాక్షి చౌద‌రి

ABN, Publish Date - Feb 06 , 2026 | 11:19 AM

హీరోయిన్ మీనాక్షి చౌదరి అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

MeenakshiChaudhary

ప్ర‌ముఖ న‌టి, టాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు, విజ‌యాల‌తో దూసుకుపోతున్న మీనాక్షి చౌద‌రి (MeenakshiChaudhary) ఈ రోజు (శుక్ర‌వారం) ఉద‌యం అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలిన‌డ‌క‌న తిరుమ‌ల (Tirumala) కు చేరుకుంది. పాదాల మండ‌పం వ‌ద్ద కొబ్బ‌రి కాయ‌లు కొట్టి మొక్కులు చెల్లించింది. అనంత‌రం వీఐపీ ద‌ర్శ‌నంలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. దర్శనం అనంత‌రం మీనాక్షి అభిమానుల‌తో స‌ర‌దాగా న‌వ్వుతూ మాట్లాడి అడిగిన వారికి సెల్ఫీలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే గ‌తంలోనూ మీనాక్షి ప‌లుమార్లు కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామి వారిని ద‌ర్శించుకోవ‌డం విశేషం. మీనాక్షి న‌టించిన లేటెస్ట్ చిత్రం 'అన‌గ‌న‌గా ఒక రాజు' సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి భారీ విజ‌యం సాధించింది. రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలోనూ తిరుమ‌ల‌కు వ‌చ్చిన మీనాక్షి ఇప్పుడు మ‌రోమారు స్వామిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది.

Updated Date - Feb 06 , 2026 | 02:38 PM