Son of Kanakadurga: అమ్మవారి అవతారంలో లయ.. పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్
ABN, Publish Date - Oct 21 , 2026 | 07:05 AM
దసరా సందర్భంగా నటి లయ అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్! ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారి రూపంలో లయ కనిపిస్తున్న పవర్ఫుల్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, స్వప్న దత్ విడుదల చేశారు.
యాక్షన్, అడ్వెంచర్, యాక్షన్ జానర్లో సరికొత్త కథతో లయ (Laya), అనురూప్ కటారి (Anuroop Katari), ఆకాంక్ష త్యాగరాజన్ (Akanksha Thiagarajan) ప్రధాన పాత్రల్లో రాగ మూవీస్ & తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’(Son of Kanakadurgamma). ఈ మూవీకి దుర్గ ఫణిదర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కాకర్ల గోవర్దనరావు కథను అందించారు. దసరా సందర్భంగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను టీం రిలీజ్ చేసింది.
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ , స్వప్న దత్ ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్ము’ పోస్టర్‌ను రిలీజ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ పోస్టర్లో అమ్మవారిగా లయ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. సన్ ఆఫ్ కనకదుర్గమ్మ సినిమాని నిధి అన్వేషణ అనే కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్నారు. ఇందులోని కథ, కథనాలు, విజువల్స్, యాక్షన్స్ అన్నీ కూడా హైలెట్ కానున్నాయి. అమ్మవారిగా లయ కనిపించే సీన్స్ రోమాలు నొక్కబొడుచుకునేలా ఉంటాయని టీం చెప్తోంది.
ఈ చిత్రానికి శశిధర్ లంక సంగీతాన్ని అందిస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామ్ కే ప్రసన్ అందించారు. ప్రసాద్ కేవీ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. రాజేష్ లంక ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకి రాఘవేందర్ రెడ్డి ఎడిటర్‌గా, చైతన్య మీనవల్లి, ప్రసాద్ కేవీ డైలాగ్స్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లను చిత్రయూనిట్ ప్రేక్షకుల్ని మెప్పించనుంది.