Kajal Aggarwal: కుర్ర హీరోయిన్లకే.. చెమటలు పట్టిస్తున్న చందమామ..
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:08 PM
పెళ్లి, బిడ్డ తర్వాత కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గని కాజల్ అగర్వాల్. లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ట్రెండ్ ఉండేది. హీరోయిన్లకు పెళ్లైందంటే చాలు.. ఇక వాళ్ళ సినీ ప్రయాణం ముగిసినట్లే అని భావించేవారు. ఒకవేళ సినిమాల్లో నటించినా అత్త, వదిన క్యారెక్టర్లు లేదా కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అయ్యేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మన స్టార్ హీరోయిన్లు గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించడం లేదు. సరికొత్త అవకాశాల కోసం గ్లామర్ సరిహద్దులను చెరిపేస్తూ కుర్ర భామలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు.
సరిగ్గా ఇదే లిస్టులో చేరిపోయింది మన చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కరోనా లాక్ డౌన్ సమయంలో తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయింది కాజల్. ఆ తర్వాత ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి, పిల్లలు.. ఇక కాజల్ కెరీర్ దాదాపుగా స్లో అయినట్లే అని, ఇక కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లే అని చాలామంది అనుకున్నారు. కానీ, కాజల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన సత్తా చాటాలని గట్టిగానే ఫిక్స్ అయింది.
సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే.. గత పది రోజులుగా కాజల్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. పెళ్లికి ముందు ఎలాంటి గ్లామర్ రోల్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించిందో.. ఇప్పుడు దానికి డబుల్ ట్రీట్ ఇస్తోంది. తన అందచందాలతో, ఫిట్ నెస్ తో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. వయసు పెరుగుతున్నా, ఓ బిడ్డకు తల్లయినా తనలో ఆ గ్రేస్ ఏమాత్రం చెక్కుచెదరలేదని ఈ ఫోటోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ రేంజ్ లో గ్లామర్ ను ఆరబోస్తూ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో నిలిచింది మన టాలీవుడ్ చందమామ.

ఆ అందాల ప్రదర్శనను తట్టుకోవడం కుర్రాళ్లకు కష్టమే అని కామెంట్స్ వస్తున్నాయి. అయితే, సడెన్ గా కాజల్ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడానికి గట్టి కారణాలే ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదేంటంటే.. కాజల్ తో పాటు ఇండస్ట్రీకి వచ్చిన తోటి హీరోయిన్లు నయనతార, త్రిష, తమన్నా లాంటి వాళ్ళు ఇప్పటికీ వరుస సినిమాలతో, పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకొందరు ఓటీటీలో వెబ్ సిరీస్ లు చేస్తూ సత్తా చాటుతున్నారు. పోటీ అంతకంతకూ పెరుగుతోంది. వీళ్ళందరితో పోలిస్తే కాజల్ రేసులో కాస్త వెనుకబడిందనే చెప్పాలి.

దీంతో తన మునుపటి ఫామ్ ను మళ్ళీ సాధించడానికి కాజల్ ఈ గ్లామర్ రూట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాతలకు తన గ్లామర్ పవర్ ఏమాత్రం తగ్గలేదని సిగ్నల్స్ ఇవ్వడానికే ఇలా సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ప్రస్తుతం కాజల్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' చిత్రంలో మండోదరి పాత్రలో నటిస్తోంది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న 'NBK111' లో బాలయ్యకు జోడీగా సందడి చేయబోతోంది. మరి, సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న ఈ కొత్త గ్లామర్ ఫోటోషూట్స్ తో మన చందమామకు మరిన్ని భారీ ఆఫర్స్ క్యూ కడతాయో లేదో వేచి చూడాలి.
