Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బ.. ఎందుకంటే
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:39 PM
అచ్చ తెలుగు నటి ఈషా రెబ్బ (Eesha Rebba) పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో ఆసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Eesha Rebba: అచ్చ తెలుగు నటి ఈషా రెబ్బ (Eesha Rebba) పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో ఆసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్ లో తాను పెట్టే పోస్టుల కింద అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక ఈషా ఫిర్యాదును అందుకున్న పోలీసులు చర్యలు చేపడతామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈషా రెబ్బ.. అంతకు ముందు ఆ తరువాత అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. వరుస అవకాశాలు వచ్చినా ఈషాకు మాత్రం విజయాలు దక్కలేదు. ఈ మధ్యనే ఓం శాంతి శాంతి శాంతిః సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఈషాకు విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇదే సినిమాలో హీరోగా నటించిన దర్శక నటుడు తరుణ్ భాస్కర్ తో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే ఈ జంట పెళ్లిచేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. దీనిపై తరుణ్ భాస్కర్ సమయం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పగా.. ఈషా మాత్రం దాటివేసింది. మరి త్వరలోనే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటుందేమో చూడాలి.