సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chandini Chowdary: కమిట్‌మెంట్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో బ్యాడ్ చేశాడు..

ABN, Publish Date - Aug 07 , 2026 | 09:02 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ సొంత గుర్తింపును సంపాదించుకున్న తెలుగు అమ్మాయి చాందిని చౌదరి.

Chandini Chowdary

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ సొంత గుర్తింపును సంపాదించుకున్న తెలుగు అమ్మాయి చాందిని చౌదరి (Chandini Chowdary). షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించి మను, కలర్ ఫోటో వంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న చాందిని తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన ఆరోపణలు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న భయానక పరిణామాన్ని బయటపెడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కమిట్‌మెంట్ అడిగిన వ్యక్తికి నో చెప్పడంతో ఇండస్ట్రీలో తనను నెగిటివ్ చేసినట్లు ఆమె తెలిపింది.


2015వ సంవత్సరంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ అవకాశం ఉందంటూ ఒక వ్యక్తి తనకు ఫోన్ చేశాడని, మాటల మధ్యలో నేరుగా కమిట్‌మెంట్ అడిగాడని, ఆ అభ్యర్థనను తాను ఏమాత్రం ఆలోచించకుండా ఖరాఖండిగా తిరస్కరించినట్లు తెలిపింది. అయితే తాను నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయిన ఆ వ్యక్తి, ఏకంగా తన తల్లికి ఫోన్ చేసి తీవ్రంగా అవమానించాడని చెప్పింది. అంతటితో ఆగకుండా.. చాందినికి పొగరు ఎక్కువ, ఎవరితో సరిగ్గా మాట్లాడదు అంటూ సినిమా పరిశ్రమలో తనపై తీవ్రమైన నెగెటివ్ ప్రచారాన్ని వ్యాప్తి చేశాడని ఆమె తెలిపింది. ఆ వ్యక్తి వేసిన తప్పుడు ముద్ర వల్ల తాను పలు మంచి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పటికీ ఆ నెగెటివిటీ ప్రభావం తన కెరీర్‌పై పడుతోందని చెప్పుకొచ్చింది.


ఇన్ని అడ్డంకులు, అవమానాలు ఎదురైనప్పటికీ తన సిద్ధాంతాల విషయంలో రాజీ పడలేదని చాందిని స్పష్టం చేసింది. అడ్డదారుల్లో లేదా కమిట్‌మెంట్లు ఇచ్చి అవకాశాలు దక్కించుకోవడం కంటే, స్వయంకృషితో, ప్రతిభతోనే ఇండస్ట్రీలో ముందుకు సాగడమే తన నైజమని చాందిని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్‌కు తలవంచకుండా, ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులకు జరిగే అన్యాయాలపై ధైర్యంగా గళం విప్పిన చాందిని చౌదరిని పలువురు నెటిజన్లు, సినీ అభిమానులు అభినందిస్తున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 09:04 PM