సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

ABN, Publish Date - Apr 28 , 2026 | 02:46 PM

పెళ్లి పేరుతో తనను, తన కుటుంబాన్ని నమ్మించి, దాదాపు రూ. 9.83 కోట్లు మోసం చేసిందంటూ బాధితుడు ధర్మేంద్ర కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో  నటి అషురెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

పెళ్లి పేరుతో తనను, తన కుటుంబాన్ని నమ్మించి, దాదాపు రూ. 9.83 కోట్లు మోసం చేసిందంటూ బాధితుడు ధర్మేంద్ర కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో  నటి అషురెడ్డి పై (Ashu Reddy) నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి సాకుతో అషురెడ్డి తన వద్ద నుంచి సుమారు రూ. 9.83 కోట్లు వసూలు చేసిందని ధర్మేంద్ర ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా, ఆమె సోదరి దివ్యారెడ్డికి కూడా రూ. 50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.పెళ్లికి అన్ని సిద్ధమవుతున్న తరుణంలో అషురెడ్డి అకస్మాత్తుగా ధర్మేంద్రను వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో తనపై నమోదైన  కేసును కొట్టివేయాలని (Quash) కోరుతూ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై వస్తున్న ఆరోపణలను అషురెడ్డి తోసిపుచ్చారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన వెర్షన్ వినకుండానే పోలీసులు ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులో వాస్తవం లేదని, కాబట్టి ఆ  ఎఫ్ఐఆర్ ను  వెంటనే కొట్టివేయాలని కోర్టును కోరారు.  ఈ కేసు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది. రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా, ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అషురెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Updated Date - Apr 28 , 2026 | 02:55 PM