సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్ సంచలన నిర్ణయం.. టాలీవుడ్‌ను వీడి అమెరికాకు మకాం?

ABN, Publish Date - Sep 15 , 2026 | 03:59 PM

మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ సినిమాల‌కు తాత్కాలికంగా గుడ్ బై చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

Anu Emmanuel

నాని ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) సినిమాల‌కు తాత్కాలికంగా గుడ్ బై చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అందం, అభిన‌యం, అన్నింటికీ మించి ఎలాంటి పాత్ర చేయ‌డానికైనా మోహ‌మాటం లేని న‌టిగా పేరు సంపాదించుకుంది.

అయిన‌ప్ప‌టికీ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో పరిశ్రమలో తీవ్ర నిరాశకు గురయ్యారు. వరుస పరాజయాలు మరియు ఆఫర్లు తగ్గిపోవడంతో విసిగిపోయిన ఆమె, భారత్‌ను వీడి తన సొంత ప్రాంతమైన చికాగోకు శాశ్వతంగా వెళ్లిపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

స్టార్ హీరోల స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన ఆమె నాలుగేండ్ల క్రితం అల్లు శిరీష్ హీరోగా వ‌చ్చిన ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో ముద్దుల‌తో రెచ్చి పోయినప్ప‌టికీ ఇండ‌స్ట్రీ అంత‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. ఈ క్ర‌మంలో త‌మిళంలో కార్తితో జంట‌గా చేసిన‌ జ‌పాన్ చిత్రం డిజాస్ట‌ర్ కావ‌డంతో అమ్మ‌డికి ఐరెన్ లెగ్ అనే ముద్ర ప‌డింది. త‌ర్వాత సినిమా అవ‌కాశాలు పూర్తిగా స‌న్న‌గిల్లాయి.

మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు శిరీష్ సినిమాల‌లో న‌టించి మంచి జోష్‌లో ఉంద‌ని అనుకున్న‌ప్ప‌టికీ కాలం మాత్రం క‌ల‌సి రాలేదు. అమెరికాలోనే పుట్టి పెరిగిన ఆమె, అక్కడ తన కుటుంబంతో కలిసి కొంతకాలం సినిమాలకు పూర్తిగా దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇమ్మాన్యుయేల్ చివ‌ర‌గా ర‌ష్మిక లీడ్ రోల్‌లో వ‌చ్చిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) అనే తెలుగు సినిమాలో న‌టించింది.

Updated Date - Sep 15 , 2026 | 04:27 PM