Anasuya Bharadwaj: 42 మందిపై.. పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు
ABN, Publish Date - Jan 17 , 2026 | 06:36 AM
తన గౌరవానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నటి అనసూయ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
తన గౌరవానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తన ఫొటోలు మార్ఫింగ్ చేయడం, అభ్యంతరకరమైన వీడియోలు రూపొందించడం, వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని లక్షంగా చేసుకొని కించపరిచేలా కొందరు పోస్టులు, కంటెంట్లు రూపొందించి ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.
ఈ చర్యలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని, వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అన సూయ కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు మదర్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ బొజ్జా సంధ్యారెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు ప్రియా చౌదరి గోగి నేని సహా మొత్తం 42 మందిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.