సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హనీ ట్రాప్.. అడ్డంగా దొరికిపోయిన మత్తువదలరా నటి

ABN, Publish Date - Nov 06 , 2026 | 01:32 PM

కేరళలోని కొచ్చిలో ఒక డాక్టర్ ని మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఫ్లాట్‌కు రప్పించి, తీవ్రంగా దాడి చేసి అతని దగ్గరనుంచి రూ. 3.5 లక్షల విలువైన విలువైన వస్తువులను దోచుకున్న ఘటన కలకలం రేపింది.

Athulya Chandra

కేరళలోని కొచ్చిలో ఒక డాక్టర్ ని మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఫ్లాట్‌కు రప్పించి, తీవ్రంగా దాడి చేసి అతని దగ్గరనుంచి రూ. 3.5 లక్షల విలువైన విలువైన వస్తువులను దోచుకున్న ఘటన కలకలం రేపింది. ఈ కేసులో మత్తు వదలరా సినిమా నటి నటి అతుల్యా చంద్ర (Athulya Chandra), నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లి (Bibin Perumbilli) సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.


నాలుగు రోజుల క్రితం కొచ్చిలోని ఎసెన్ స్ప్రింగ్‌డేల్ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఒకరికి అత్యవసర వైద్య సహాయం కావాలని నమ్మించి నిందితులు ఆ డాక్టర్‌ను ఇంటికి రమ్మని కోరారు. ఆ డాక్టర్ ఫ్లాట్‌కు చేరుకోగానే అక్కడ దాదాపు 12 మంది వ్యక్తులు అతడిని చుట్టుముట్టారు. ఆ తర్వాత నిందితులు ఆ డాక్టర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. తమ బంధువుపై ఆ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ తప్పుడు ఆరోపణలు చేసి కేసు పెడతామని బెదిరించారు. బిబిన్ పెరుంబిల్లితో పాటు మరికొందరు ఆ వైద్యుడిని కుర్చీలో కూర్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టి, ప్రక్కఎముకలపై దాడి చేశారు. అతుల్యా చంద్ర ఆ డాక్టర్ ఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లను బలవంతంగా లాక్కుని, నువ్వు దొంగవి, నిన్ను చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.


అనంతరం నిందితులు ఆ డాక్టర్‌ను ఒక గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న ఆ డాక్టర్ నేరుగా కడవంత్రా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో గుట్టు బయటపడింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మిగతా 9 మంది నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం దోపిడీ కోసమే ఈ అటాక్ చేశారా లేక దీని వెనుక వేరే ఏదైనా ఉద్దేశం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇక ఈ వ్యవహారంలో అతుల్యా చంద్ర ఉండడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది. శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మత్తు వదలరా సినిమాలో మైరా అనే పాత్రలో అతుల్యా కనిపించింది. ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని తీసుకొచ్చిపెట్టింది. ఈ చిత్ర సీక్వెల్ లో కూడా దాసు రారా అనే సాంగ్ లో అతుల్యా కనిపించి మెప్పించింది. ఆ తరువాత టాలీవుడ్ లో ఆమె ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఈ క్రైమ్ లో ఆమె ఉండి అని తెలియడంతో సినిమాలోనే కాదు బయట కూడా అమ్మడు క్రిమినలే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Nov 06 , 2026 | 01:39 PM