హీరోయిన్ గా శ్రీకాంత్ కూతురు.. కొత్త క్రష్ వచ్చేసిందిరోయ్
ABN, Publish Date - Oct 11 , 2026 | 09:56 PM
టాలీవుడ్‌లో మరో స్టార్ కిడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ (Srikanth), నటి ఊహ (Ooha) దంపతుల కుమార్తె మేధా మేక (Medha Meka) సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టబోతుంది.
టాలీవుడ్‌లో మరో స్టార్ కిడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ (Srikanth), నటి ఊహ (Ooha) దంపతుల కుమార్తె మేధా మేక (Medha Meka) సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే వీరి కుమారుడు రోషన్ మేక హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు కూతురు కూడా మంచి బ్యానర్ లో అడుగుపెట్టింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ మైత్రీ ఇన్ లవ్ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా పరిచయమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇక ఈ చిత్రంలో జై జస్తి హీరోగా నటిస్తున్నాడు. మూడేళ్ళ క్రితం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు జై. ఆ సినిమా తరువాత ఇప్పుడు మళ్లీ మైత్రీ ఇన్ లవ్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకి పృధ్వీ వనం దర్శకత్వం వహిస్తుండగా నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే అనిల్ యర్నేని సహ నిర్మాతగా, మహేష్ బాబు.పి క్రియేటర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.
మైత్రీ ఇన్ లవ్ చిత్రంలోని ప్రధాన పాత్రల పరిచయం అక్టోబర్ 12 ఉదయం 10:26 గంటలకు గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మేధ చిన్నతనం నుంచి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ, మేధ టీనేజ్ లోకి వచ్చాక.. అచ్చుగుద్దినట్లు అమ్మ ఊహ పోలికలతో ఎంతో అందంగా కనిపించింది. ఆ సమయంలోనే మేధను కుర్రకారు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని కోరారు. ఇక ఇప్పుడు అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని తెలియడంతో కొత్త క్రష్ వచ్చేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో మేధ ఎలాంత విజయాన్ని అందుకుంటుందో చూడాలి.