అయ్యప్ప మాల ధరించిన శ్రీకాంత్..
ABN, Publish Date - Oct 11 , 2026 | 07:39 AM
దసరా పండుగ మొదలైంది.. అయ్యప్ప మాలధారణలకు సమయం ఆసన్నమైంది.
దసరా పండుగ మొదలైంది.. అయ్యప్ప మాలధారణలకు సమయం ఆసన్నమైంది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ శరణుఘోషతో తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లనున్నాయి. ఆదివారం టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యప్ప మాల ధరించారు. ఆయన స్నేహితులు ఈటీవీ ప్రభాకర్ తదితరులతో కలిసి శ్రీనగర్ కాలనీ అయ్యప్ప దేవాలయంలో జొన్నలగడ్డ శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్నారు. మండలకాలం ఆయన దీక్ష చేయనున్నారు. టాలీవుడ్‌లో వంద చిత్రాలకు పైగా నటించిన నటుల్లో శ్రీకాంత్ ఒకరు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆయన బిజీగా ఉన్నారు. సినిమాలే కాకుండా వెబ్‌సిరీస్‌లతో కూడా అలస్తున్నారు. ఇటీవల ‘మిస్టర్ మిడిల్ క్లాస్’, ‘అబ్జక్షన్ మై లార్డ్’ చిత్రాలతో మెప్పించారు.