సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆర్సీ17 లో జూనియర్ రజనీకాంత్.. ఇదిగో క్లారిటీ

ABN, Publish Date - Nov 10 , 2026 | 05:57 PM

ఈమధ్య స్టార్ హీరో సినిమా మొదలవుతుంది అంటే.. అందులో పాన్ ఇండియా లెవెల్ నటీనటులను దింపడం ట్రెండ్ గా మారింది. అన్ని భాషల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Actor Rishikanth

ఈమధ్య స్టార్ హీరో సినిమా మొదలవుతుంది అంటే.. అందులో పాన్ ఇండియా లెవెల్ నటీనటులను దింపడం ట్రెండ్ గా మారింది. అన్ని భాషల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలా చేయడం వలన ఆ చిత్రంపై హైప్ మరింతగా పెరుగుతుంది. ఎక్కువగా స్టార్ హీరో సినిమాల్లో మరో స్టార్ హీరో కానీ, ఎక్కువ ఫేమస్ అయిన నటులను కూడా విలన్స్ గా, కీలక పాత్రలకి ఎంపిక చేస్తారు. అలానే రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో వస్తోన్న ఆర్సీ 17లో తమిళ నటుడు రిషికాంత్ (Rishikanth) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


‘మోధ రాత్రి’, ‘డొరోతీ’ వంటి సినిమాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషికాంత్. జూనియర్ రజనీకాంత్ గా పేరు తెచ్చుకున్న రిషి రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న ఆర్సీ17 పూజా కార్యక్రమంలో కనిపించాడు. దీంతో రిషి.. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోలీవుడ్ లో ఇప్పుడిప్పుడే స్టార్ రేంజ్ తెచ్చుకుంటున్న ఈ నటుడు.. ఇప్పుడు తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. అది కూడా చరణ్ - సుక్కు కాంబోలో అంటే మంచి ఎంట్రీనే అంటూ చెప్పుకొచ్చారు.


అయితే ఈ ప్రచారంపై నటుడు రిషికాంత్ తాజాగా స్పందిస్తూ రూమర్లకు చెక్ పెట్టాడు. తాను ఆర్సీ17 ప్రాజెక్ట్‌లో నటించడం లేదని ఆయన స్పష్టత ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ లో లేకపోతే పూజా కార్యక్రమానికి ఎందుకు హాజరు అయ్యాడు అనేది కూడా చెప్పుకొచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అతను మోధ రాత్రి అనే సినిమా చేశానని, ఆ పరిచయం, నిర్మాతల ఆహ్వానం మేరకే ఈ వేడుకకు వెళ్లానని వెల్లడించాడు. 'నేను సినిమాలో ఉన్నానని అనుకుని థియేటర్లలో చూసి నిరాశపడటం కంటే ముందే స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెప్తున్నాను' అని రిషికాంత్ పేర్కొన్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కొద్దిగా నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్న నటుడు రిషి.. సుకుమార్ కొద్దిగా అతనిని కూడా పెట్టాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు.


మరోవైపు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై బాక్సాఫీస్ వద్ద అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రాజెక్ట్ లాంచ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మొదటి క్లాప్ కొట్టారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఈ చిత్రంతో చరణ్ - సుకుమార్.. రంగస్థలం రికార్డులను తిరగరాస్తారేమో చూడాలి.

Updated Date - Nov 10 , 2026 | 06:01 PM