సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డీజే టిల్లు నటుడి ఇంట తీవ్ర విషాదం..

ABN, Publish Date - Mar 06 , 2026 | 06:58 PM

టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మురళీధర్ భార్య ఐరేని శశికళ(58) మృతి చెందారు.

Muralidhar Goud

టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మురళీధర్ భార్య ఐరేని శశికళ(58) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ గురువారం మరణించారు. దీంతో మురళీధర్ గౌడ్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. గతంలో రామాయంపేట గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఆమె వార్డు సభ్యురాలిగా ఎన్నికై ప్రజలకు విశేష సేవలు అందించారు. ఈ విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మురళీధర్ గౌడ్.. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి రిటైర్‌ అయ్యాక నటనపై ఆసక్తితో సినీ ప్రయత్నాలు మొదలుపెట్టి 2018లో 'రంగస్థలం' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2022 లో రిలీజైన డీజే టిల్లు సినిమాలో సిద్దు జొన్నలగడ్డ తండ్రిగా నటించారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఆ తరువాత బలగం సినిమా మరిన్ని అవకాశాలను తీసుకొచ్చింది. మేము ఫేమస్, మ్యాడ్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు గుర్తింపు తీసుకొచ్చాయి.

Updated Date - Mar 06 , 2026 | 07:54 PM