Anand: ఆ సినిమా క్లైమాక్స్ చూసి రిమోట్ పగలకొట్టా..
ABN, Publish Date - Jun 22 , 2026 | 05:42 PM
సీనియర్ నటుడు ఆనంద్ భారతి(Anand Bharathi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దొంగ దొంగ సినిమాలో ప్రశాంత్ తో పాటు మరో హీరోగా నటించి మెప్పించాడు
సీనియర్ నటుడు ఆనంద్ భారతి(Anand Bharathi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దొంగ దొంగ సినిమాలో ప్రశాంత్ తో పాటు మరో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తరువాత తెలుగు, తమిళ్ భాషల్లో హీరోగా, విలన్ గా కనిపించిన ఆనంద్.. ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రిగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినిమాలే కాకుండా సీరియల్స్ లో కూడా ఆనంద్ సత్తా చాటుతున్నాడు. ప్రెజెంట్ స్టార్ మాలో ప్రసారమవుతోన్న పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నాడు.
ఇక సినిమాల విషయానికొస్తే.. సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబోలో వస్తోన్న రావు బహదూర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జులై 3 న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆనంద్.. వెంకటేష్ మహా డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, అతని ఫోటోను ప్రింట్ తీయించి బెడ్ రూమ్ లో పెట్టుకున్నట్లు తెలిపాడు. అంతలా అతన్ని అభిమానించడానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు.
' కేరాఫ్ కంచరపాలెం ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. అదొక కావ్యం అని చెప్పొచ్చు. ఒక బెస్ట్ మూవీ. కోవిడ్ సమయంలో ఆ సినిమా చూసి.. రిమోట్ ని నేలకేసి కొట్టాను. అది నాలుగు ముక్కలు అయ్యింది. రిమోట్, రెండు బ్యాటరీలు, కవర్. మొత్తం కలిపి నాలుగు అయ్యాయి. అలా నాలుగు క్యారెక్టర్లు ఒక్కరే. అసలు ఏం చేశార్రా. అందులో ఎవరికీ డౌట్ రాకుండా.. ఒకరు హిందూ, ఒకరు క్రిస్టియన్, ఒకరు ముస్లిం, ఒకరు నాస్తికుడు.. ఐడెమ్ స్క్రిప్ట్ అని నాకు పిచ్చెక్కింది. అలా బాల్కనీలోకి వెళ్లి నుంచుంటే.. ఒక సినిమా కోసం ఇంతలా ఆలోచించాలా అని నా భార్య అంటే ఆమె మీద కూడా అరిచాను.
అసలు ఎవరు ఈ సినిమా తీసింది అని చూస్తే వెంకటేష్ మహా. మణిరత్నం సినిమాలో చేయాలి అనేది వదిలేసి.. ఎలాగైనా వెంకటేష్ మహా సినిమాలో చేయాలని ఆయనకు కాల్ చేశాను. కానీ, ఆయన తీయలేదు. ఇక ఆయన ఫోటో ప్రింట్ తీసి బెడ్ రూమ్ లో పెట్టుకొని రోజు దేవుడిని కోరుకొనేవాడిని. ఒకరోజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి.. డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడతారని చెప్పాడు. నేను నా ఫ్రెండ్స్ ఎవరో ఏడిపిస్తున్నారు అనుకున్నాను. ఆ తరువాత ఆయన మాట్లాడి రావు బహదూర్ కథ చెప్పాడు. చాలామంది కథ. ఈ క్లైమాక్స్ కూడా పిచ్చెక్కిపోతుంది' అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.