సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Fauzi: ఫౌజీ షూటింగ్‌.. ఒకరి మృతి.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - May 05 , 2026 | 10:49 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం షూటింగ్‌కు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురై విషాదం చోటు చేసుకుందని తెలిసింది.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi) భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్‌కు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురై విషాదం చోటు చేసుకుందని తెలిసింది. ప్రొడక్షన్‌ యూనిట్‌ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అబ్దుల్లాపూర్‌మెట్‌ దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

‘సీతారామం’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్నీ కథానాయిక. జయప్రద, అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి తదితరులు కీలక పాత్రధారులు. టి-సిరీస్‌ గుల్షన్‌కుమార్‌; భూషణ్‌కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - May 05 , 2026 | 01:59 PM