సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కాకినాడలో NBK 111 షూటింగ్‌లో ప్ర‌మాదం.. బాలకృష్ణకు గాయాలు! ఆస్పత్రికి తరలింపు

ABN, Publish Date - Jul 21 , 2026 | 01:37 PM

కాకినాడ పోర్ట్‌లో NBK111 షూటింగ్ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ కాలుజారి పడిపోవడంతో మోకాలికి స్వల్ప గాయం అయినట్లు సమాచారం. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Balakrishna

బాలకృష్ణ హీరోగా (Balakrishna) గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ లో బాలయ్య ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో బాలయ్య 111వ చిత్రం కోసం యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ, ఇందులో నెగటివ్ రోల్ పోషిస్తోన్న మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తూండగా బాలయ్య కాలుజారి కిందపడ్డారు. దాంతో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గాయానికి చికిత్స చేసిన డాక్టర్లు కంగారు పడవలసిన పనిలేదని చెప్పారు. గాయం చిన్నదే కాబట్టి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలియగానే కంగారు పడ్డ అభిమానులు, వైద్యుల చెప్పింది తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. వార్త తెలిసిన ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ 'గెట్ వెల్ సూన్ బాల బాబాయ్.' అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

పలుమార్లు ప్రమాదాలు...

బాలకృష్ణకు షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. ఆయన హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే 1985లో 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. అందులో హీరోయిన్ అనితారెడ్డి కారు డ్రైవ్ చేసుకుంటూ హీరోను డ్యాష్ ఇచ్చే సీన్ ఉంది.ఆ సీన్ లో నిజంగానే బాలయ్యను గుద్దేసింది. అప్పట్లో బాలయ్య నడుముకు గాయమైంది. ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' కోసం ఫైట్ చేస్తూండగా మోకాలుకు దెబ్బతగిలింది... దానిని అంతగా పట్టించుకోకపోవడంతో తరువాతి రోజుల్లో తీవ్ర ఇబ్బందులు కలిగాయి. అలాగే 'విజయేంద్రవర్మ' పోరాట సన్నివేశంలో బాలయ్య కాలుకు పెద్ద ప్రమాదం జరిగింది. దాంతో కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవలసి వచ్చింది. 'లయన్' సినిమా షూటింగ్ లోనూ బాలయ్య కాలికి గాయమయింది. ఇలా పలుమార్లు ప్రమాదాలకు గురైన బాలయ్యకు ఈ సారి మళ్ళీ దెబ్బ తగలడంతో అభిమానులు ఆందోళన చెందారు.

బాలయ్య ప్రమాదం సంగతి ఇలా ఉండగా ఆయనతో కొరటాల శివ తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. అందులో ఐశ్వర్య రాజేశ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఆ పాత్ర బాలయ్యతో ఢీ కొనేలా ఉంటుందని తెలుస్తోంది. బాలకృష్ణతో ఐశ్వర్యా రాజేశ్ తండ్రి రాజేశ్ కొన్ని సినిమాల్లో నటించారు. వారిద్దరూ కలసి నటించిన సినిమాల్లో 'సీతారామకళ్యాణం' విశేషాదరణ చూరగొంది... అందులో హీరోయిన్ రజనీ అన్నయ్య పాత్రలో రాజేశ్ నటించారు. ఇప్పుడు బాలయ్య సినిమాలో రాజేశ్ కూతురు ఐశ్వర్య కీలక పాత్ర పోషించబోవడం విశేషమనే చెప్పాలి. మరి బాలయ్యతో ఐశ్వర్య ఢీ కొనే పాత్ర ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

Updated Date - Jul 21 , 2026 | 05:07 PM