హిమాలయాలల్లో దాగి ఉన్న.. అంతుచిక్కని రహస్యం
ABN, Publish Date - Feb 16 , 2026 | 06:56 AM
అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న చిత్రం ‘నాగబంధం’.
అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ దర్శకుడు అభిషేక్ నామా (Abhishek Nama) తెరకెక్కిస్తున్న చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్‌బాబు చేతుల మీదుగా ఆదివారం ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్ ఆద్యంతం దృశ్యకావ్యంలా సాగింది. విరాట్ కర్ణను శక్తిమంతమైన యోధుడిగా పరిచయం చేస్తూ, హిమాలయాల్లో దాగి ఉన్న నాగబంధం దేవాలయం చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ కూడిన, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ పనితనం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతుచిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తే ఈ నాగబంధం. ‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని మహేశ్‌బాబు పేర్కొన్నారు. నభా నటేశ్, ఐశ్వర్యమీనన్, జగపతిబాబు వంటి తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.