సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హౌస్‌ఫుల్ షోలతో ‘ఆదర్శ కుటుంబం’ సందడి.. బుకింగ్స్‌లో జోరు

ABN, Publish Date - Nov 01 , 2026 | 09:52 PM

‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి స్పందన లభిస్తోంది. పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలతో థియేటర్లలో సందడి నెలకొంది.

Aadarsha Kutumbam

బాక్సాఫీస్ వద్ద ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) సినిమా జోరు కొనసాగుతోంది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ చిత్రం మంచి దూకుడు ప్రదర్శించింది. చాౠ ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ వేగంగా జరుగుతుండటంతో పాటు, చాలా చోట్ల షోలు హౌస్‌ఫుల్ అవుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

వీకెండ్ అవ‌డం, పోటీగా పెద్ద సినిమా లేక‌పోవ‌డం, ముఖ్యంగా ఆదివారం సెలవు కావడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగిన‌ట్లు కనిపిస్తోంది. ముందస్తు టికెట్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న రోజుల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న హవాతో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందం మంచి ఉత్సాహంలో ఉంది. ఆదివారం పూర్తయ్యే సమయానికి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు నమోదు చేస్తుందో చూడాలి.

Updated Date - Nov 01 , 2026 | 09:52 PM