సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aadarsha Kutumbam Tariler: చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్

ABN, Publish Date - Oct 23 , 2026 | 09:20 PM

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన విక్టరీ వెంకటేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. 

Aadarsha Kutumbam

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కలయికలో వస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేళకులు ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 


ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే త్రివిక్రమ్, ఈసారి పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి మారి వెంకటేష్‌తో చేసిన ఈ ప్రయోగం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. కథ విషయానికొస్తే.. చిట్టి బాబు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్. అప్పులు చేసే భార్య, చదువురాని కొడుకు, తెలివి లేని కూతురు.. ఇదే అతని ప్రపంచం. సడెన్ గా చిట్టిబాబుకి లాటరీ తగిలినట్లు  డబ్బు రావడంతో కుటుంబంతో కలిసి పెద్ద విల్లాకి షిఫ్ట్ అవుతాడు. ఇక వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఒక దొంగల గ్యాంగ్.. పెద్ద పెద్ద ఇళ్లలో పడి దోచుకోవడమే కాకుండా వారిని చంపేస్తూ ఉంటారు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారుతుంది. అయితే ఆ దొంగల బ్యాచ్..  ఒక రాత్రి చిట్టిబాబు  ఉన్న ఇంట్లో దొంగతనం చేస్తారు.. ? ఆ తరువాత ఏం జరిగింది.. ? కుటుంబాన్ని కాపాడడానికి చిట్టిబాబు ఏం చేశాడు..? చిట్టిబాబు కోసం కుటుంబం ఎలా నిలబడింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 


ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో అలరించిన వెంకటేష్, ఈ చిత్రంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత ఇంటెన్స్, మాస్ , వైలెంట్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాడు. వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, క్రైమ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ చూస్తుంటే త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్‌కు ప్రాణంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. ట్రైలర్‌లో వినిపించిన పవర్‌ఫుల్ డైలాగ్స్ త్రివిక్రమ్ మార్క్ ని గుర్తుచేస్తున్నాయి.  ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పీక్స్‌కి వెళ్లే యాక్షన్ డ్రామాగా వస్తున్న ఆదర్శ కుటుంబం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడం పక్కా. ట్రైలర్‌తోనే ఇంతటి రచ్చ రేపిన ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో ఊచకోత కోస్తుందో చూడాలి. 

Updated Date - Oct 23 , 2026 | 09:33 PM