Folk Song: దొండకాయ.. బెండకాయ.. అనుపమ నువ్వే నా గుండెకాయ! ఫోక్ సాంగ్.. విన్నారా
ABN, Publish Date - Jan 02 , 2026 | 11:25 AM
ఫోక్ సాంగ్స్ రోజురోజుకు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌ను మించి వ్యూస్ రాబడుతూ ప్రేక్షకులకు తనివితీరా ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్నాయి.
ఫోక్ సాంగ్స్ రోజురోజుకు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌ను మించి వ్యూస్ రాబడుతూ ప్రేక్షకులకు తనివితీరా ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్నాయి. వీటికంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడి ఎప్పుడు ఈ పాటలు వస్తాయా అనే ఎదురు చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఇటీవలే చికెనే తెత్తడో అనే పాట వైరల్ అవగా ఇప్పుడు వారం తిరగకుండానే మరో సాంగ్ విడుదలై శ్రోతలను బాగా రంజింపజేస్తోంది.
గతంలో మనం హీరోయిన్ అనుపమను బాగా ఇష్టపడే ఓ ఫ్యాన్ అఅమెను ఉద్దేశించి చెప్పిన దోండకాయ, బెండకాయ నువ్వు నా గుండెకాయ అంటు చెప్పిన డైలాగ్ విపరీతంగా ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే డెలాగ్‌ను పల్లవిగా చేసుకుని ఓ పూర్తి పాటను తయారు చేసి విడుదల చేయగా మంచి ఆదరణను రాబట్టుకుంటుంది, వైరల్ అవుతుంది.
నవసందీప్ (Navasandeep) అనే సింగర్ ఈ పాటను స్వయంగా రచించి ఆలపించగా జాన్, గణేశ్ (John&ganesh) సంగీతం అందించారు. కృష్ణా నగర్ కష్టాలను ఎకరువు పెడుతూ తన అభిమానించిన హీరోయిన్ల గురించి వారి పేర్లను పాటలో జత చేసిన, కూరగాయలు, చీరలతో పోల్చిన విధానం, పాట సాగిన పద్దతి అద్యంతం వినోదం పంచేలా ఉంది. దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ, తెల్ల చీర.. ఎర్ర చీర చూడంగానే నచ్చేసింది నయన తార, మేలుకుందునా.. పండుకుందునా నిద్ర పాడు చేసింది రష్మిక మందనా అంటూ పాటను పరుగులెత్తించారు. మీరూ ఇంకా వినకుంటే ఇప్పుడే వినేయండి.