సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

India Joy 2026: హైదరాబాద్‌లో గ్లోబల్ సినీ సంబరం.. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ సహా దిగ్గజ సంస్థల సందడి

ABN, Publish Date - Nov 18 , 2026 | 09:12 AM

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీలో ఇండియా జాయ్-2026 నిర్వహించనున్నారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ సహా 200కు పైగా సంస్థలు పాల్గొననున్నాయి.

India Joy 2026

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit) లో భాగంగా ఇండియా జాయ్-2026 (India Joy 2026) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ప్యూచర్ సిటీలో డిసెంబరు 7 నుంచి 13 వరకు నిర్వహించనున్న కార్యక్రమం ద్వారా తెలుగు సినిమా (Telugu Film Industry), యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇండియా జాయ్-2026 సన్నాహాలపై మంగళవారం సచివాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ సినీపరిశ్రమ అభివృద్ధికి హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. ఇండియా జాయ్ నిర్వహణ ప్రణాళికలు, ఏవీ జీసీ పాలసీ, ఇమేజ్ టవర్స్ అభివృద్ధి, సృజనాత్మక రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం తదితర అంశాలను ఆయన వివరించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్ సీ) చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఇండియా జాయ్-2026 సన్నాహాలపై మంగళవారం సచివాలయంలో సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ జాయ్‌ను విజయవంతం చేసేందుకు సినీ పరిశ్రమ తరపున కృషి చేస్తామన్నారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్ బాబు మాట్లాడుతూ సినీ, సృజనాత్మక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్వాగ తిస్తున్నామన్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్య క్షుడు వీఎన్ ఆదిత్య, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఉపాధ్యక్షుడు మాదాల రవి తదితరులు ఇండి యాజాయ్ నిర్వహణకు మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ రంగాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను సనత్ (పై ర్), బాసిరెడ్డి సునీల్ (ఫాంటమ్) వివరించారు. ఇండియా జాయ్-2026ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని గ్లోబల్ సమ్మిట్ వ్యూహాత్మక సలహాదారు అచల్ మల్హోత్రా తెలిపారు.

15కు పైగా ప్రత్యేక కార్యక్రమాలు

ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇండియా జాయ్‌లో సినిమాలు, ఏవీజీసీ-ఎక్స్ట్రార్, గేమింగ్, సంగీత కచేరీలు, ప్రముఖులు, ఇన్‌ఫ్లూయన్సర్లకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా నిర్వహించనున్న కార్యక్రమానికి లక్ష మందికి పైగా సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డీఎన్ జీ, ఈఏ స్పోర్ట్స్, యూబీ సాఫ్ట్, అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీతోపాటు 200పైగా సంస్థలు పాల్గొననున్నాయి.

వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఓటీటీ వేదికల ప్రతినిధులు, అంతర్జాతీయ స్టూడియోలకు చెందిన 100మంది పైగా పెట్టు బడిదారులు, కొనుగోలుదారులు హాజరయ్యే అవకాశం ఉంది. వీఎఫ్ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండియన్ ఫిల్మ్ కాన్ క్లేవ్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ (హెచ్ఎఐఎఫ్ఎఫ్) సహా 15కుపైగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబరు 8న రెడ్కోర్పెట్ కార్యక్రమం, 9న ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) సంగీత కచేరీ ఉంటుంది.

Updated Date - Nov 18 , 2026 | 09:22 AM