ప్రభాస్ నుంచి డబుల్ బ్లాస్ట్.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరే అప్‌డేట్!
ABN, Publish Date - Aug 06 , 2026 | 06:03 PM
ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నాన్ స్టాప్‌గా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ ఏడాది రాజాసాబ్ సినిమాతో వచ్చిన ఫ్లాప్‌ను తన కొత్త సినిమాలతో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఒకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ (Spirit), మరొకటి హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫౌజీ (Fauji) ప్యారలల్‌గా షూటింగ్ జరుపుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల స్పీడ్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుంది.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా దాదాపు ఒక నెల రోజుల బ్రేక్ ఇచ్చారట. స్పిరిట్ షూటింగ్ కొద్దిరోజులు పక్కన పెట్టడంతో, ఆ గ్యాప్‌ను ఫౌజీ టీమ్ ఫుల్‌గా వాడుకుంటోంది. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో వెళ్తుంది. ఫౌజీ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు దర్శకుడు హను రాఘవపూడి ఒకేసారి రెండు యూనిట్లతో వర్క్ చేయిస్తున్నారు. హైదరాబాద్ గండిపేట పరిసర ప్రాంతాల్లో ఒక యూనిట్ ప్రభాస్‌పై మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుంటే.. మరోవైపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకో యూనిట్ భారీ వాటర్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తోంది. ప్రభాస్ రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ ఏడాది మొదట్లో వచ్చిన రాజాసాబ్ తో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినా, ఫౌజీ తో మాత్రం ఆ నిరాశను వంద రెట్లు ఉత్సాహంగా మార్చేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ ఒక ఇండియన్ బ్రిటిష్ సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫౌజీ యాక్షన్ లుక్ సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేసింది. ఆ లుక్ చూసిన తర్వాతే అభిమానులకు ఫౌజీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫౌజీలో యాక్షన్ ఎపిసోడ్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తూనే హను రాఘవపూడి తన మార్క్ క్లాసిక్ లవ్ టచ్ కూడా ఉండబోతోందని సమాచారం.
ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ టీజర్‌ను వదిలి, అంచనాలను మరింత పీక్స్‌కు తీసుకెళ్లే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఇక మరోవైపు, స్పిరిట్ షూటింగ్‌కు సందీప్ రెడ్డి వంగా కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ, ఆయన ఖాళీగా ఏమీ లేరు. ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ టైమ్‌ను వాడుకుంటూ, సందీప్ వర్క్ ఎడిటింగ్ మరియు మ్యూజిక్ పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో గడుపుతున్నారు.
అంటే ఈ గ్యాప్‌లో స్పిరిట్ అవుట్‌పుట్‌ను ఇంకా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దే పనిలో పడ్డారు సందీప్. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ప్రభాస్ నుంచి రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు బాక్సాఫీస్ వద్దకు రాబోతుండటం సాధారణ విషయం కాదు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్‌గా స్పిరిట్ లో, మరోవైపు సోల్జర్‌గా ఫౌజీ లో ప్రభాస్ చూపించబోయే విశ్వరూపం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.