సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

National Awards: జాతీయ పురస్కారాల ప్రకటన మరింత ఆలస్యం..

ABN, Publish Date - Jul 04 , 2026 | 04:11 PM

భారతీయ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భావించే జాతీయ పురస్కారాల ప్రకటన ఈ నెల మూడో తేదీని వస్తుందని సినీ ప్రియులు, మేకర్స్‌ భావించారు.

భారతీయ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భావించే జాతీయ పురస్కారాల ప్రకటన ఈ నెల మూడో తేదీని వస్తుందని సినీ ప్రియులు, మేకర్స్‌ భావించారు. అయితే పలు కారణాల చేత శుక్రవారం ప్రకటించలేదు. అయితే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన మరింత ఆలస్యం అయ్యేలా ఉందని తెలుస్తోంది. ఈ వారంలో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ విజేతల ప్రకటన ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవార్డుల ఎంపికపై జ్యూరీ సభ్యుల చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, జ్యూరీ సభ్యులకు ఇతర ముందస్తు కమిట్‌మెంట్‌లు ఉండటమే కారణమని అధికారిక వర్గాలు తెలిపాయి.

దీనిని బట్టి చూస్తే విజేతల ప్రకటనకు మరో వారం రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అవార్డుల ప్రకటనపై ఊహాగానాలతో కూడిన వార్తలను ప్రసారం చేయవద్దని మీడియాకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి:

Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా

Bandla Ganesh: సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా.. న్యాయం సాధిస్తా..

ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా

Updated Date - Jul 04 , 2026 | 04:15 PM