సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. పుష్ప ది రూల్‌ హ‌వా

ABN, Publish Date - Feb 22 , 2026 | 06:23 AM

70వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక (70th Filmfare Awards) నిన్న (శ‌నివారం) కేరళలోని కొచ్చిలో అంగ‌రంగ‌ వైభ‌వంగా జ‌రిగింది.

Filmfare Awards

70వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక (70th Filmfare Awards) నిన్న (శ‌నివారం) కేరళలోని కొచ్చిలో అంగ‌రంగ‌ వైభ‌వంగా జ‌రిగింది. కేరళ (Kerala) ప్రభుత్వం కేర‌ళ టూరిజంతో క‌లిసి ఫిలింఫేర్‌ నిర్వ‌హించిన ఈ ఫంక్ష‌న్‌కు ద‌క్షిణాది సినీ తార‌లు అంతా హ‌జ‌రై వేడుక‌కు ప్ర‌త్యేక శోభను తీసుకొవ‌చ్చారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాక‌తో అక్క‌డ పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. వేలాది మంది అభిమానులు ఎయిర్ పోర్ట్‌కు సైతం త‌ర‌లి వ‌చ్చారు.

శ‌నివారం రాత్రి జ‌రిగిన వేడుక‌లో 2024లో థియేట‌ర్ల‌లో రిలీజైన తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ చిత్రాలలో న్యాయ నిర్ణేత‌లు ఎంపిక చేసిన‌ ఉత్త‌మ చిత్రాల‌కు, టెక్నీషియ‌న్ల‌కు పురస్కారాలు అంద‌జేశారు. వీటిలో ఉత్త‌మ న‌టుడు అల్లు అర్జున్‌, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో పాటు మ‌రో నాలుగు విభాగాల్లో పుష్ప‌-2 హ‌వా చాటి అవార్డులు ద‌క్కించుకుంది. ఈ అవార్డుతో అల్లు అర్జున్ 7 ఫిలింఫేర్ అవార్డుల‌తో తెలుగు నాట రికార్డు సృష్టించాడు. 9 అవార్డుల‌తో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నారు. ఇక‌.. 35 చిన్న క‌థ కాదు సినిమాకు గాను నివేదా థామ‌స్ ఉత్త‌మ న‌టి అవార్డు ద‌క్కించుకుంది.


అవార్డులు పొందిన నటులు - టెక్నీషియన్లు

ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ నటి (డెబ్యూ)- నయన్‌ సారిక(గం గం గణేశ)

ఉత్తమ నటుడు (డెబ్యూ) - సందీప్‌ సరోజ్‌(కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ దర్శకుడు (డెబ్యూ)-యధు వంశీ(కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ నటి - నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) - తేజ సజ్జా(హను-మాన్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌)- కాజల్‌ అగర్వాల్‌(సత్యభామ)

ఉత్తమ సహాయ నటుడు- అమితాబ్‌ బచ్చన్‌(కల్కి 2898 ఏడీ)

ఉత్తమ సహాయ నటి - అంజలి(గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)

ఉత్తమ మ్యూజిక్‌ అల్బమ్‌- దేవిశ్రీ ప్రసాద్‌(పుష్ప 2: ది రూల్‌)

ఉత్తమ లిరిక్స్‌- రామ జోగయ్య శాస్త్రి(చుట్టమల్లే - దేవర)

ఉత్తమ గాయని- శిల్పారావు(చుట్టమల్లే - దేవర)

ఉత్త‌మ‌ గాయ‌కుడు: శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి- గుంటూరు కారం)

ఉత్త‌మ‌ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్‌ ( కుర్చీ మడతపెట్టి - గుంటూరు కారం)

ఉత్త‌మ‌ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా (పుష్ప 2), నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)

Updated Date - Feb 23 , 2026 | 06:05 AM