‘రోమాంచకం’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ
ABN , Publish Date - Aug 26 , 2026 | 08:43 AM
బ్లాక్ బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమా టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ.
బ్లాక్ బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘రోమాంచకం’ (Romanchakam). వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. జోరుగా సాగుతున్న ప్రమోషన్లలో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘NSR స్పెషల్ ఇంటర్వ్యూ’లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలు, తమ కెరీర్ అనుభవాలను పంచుకుంది.
ఇంటర్వ్యూలో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా బ్యానర్‌లో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ‘రోమాంచకం’ కథలో ప్రేమ, ఉత్కంఠ.. ఆద్యంతం నవ్వించే హాస్యం ఉంటాయని చెప్పారు. గత చిత్రాలతో పోలిస్తే మొదటిసారి హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి స్థాయి అర్బన్, ఎనర్జిటిక్ క్యారెక్టర్ చేశానని తెలిపారు. ఈ పాత్ర నేచురల్‌గా రావడానికి ఆరు నెలల పాటు ప్రత్యేకంగా రిహార్సల్స్, వర్క్‌షాప్‌లు నిర్వహించామని, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా పూర్తి సహకారం అందించారని వివరించారు.
హీరోయిన్ అనంతిక మాట్లాడుతూ.. ‘ఎనిమిది వసంతాలు’ తర్వాత కథ వినగానే చాలా వినోదాత్మకంగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు. డాన్సర్‌గా తన చిన్ననాటి ప్రయాణం, కుటుంబ నేపథ్యం నుంచి నటిగా ఎదిగిన తీరును ఆమె గుర్తుచేసుకున్నారు. అలాగే మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికే తాను ప్రాధాన్యమిస్తానని స్పష్టం చేశారు. వాసుకి వైభవ్ అందించిన మెలోడీ సంగీతం, సరికొత్త సౌండింగ్, పవన్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని, థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. ఇంకా ఈ టీమ్ చెప్పిన విషయాలేంటో తెలుసుకోవాలంటే పై వీడియో చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
100 కోట్ల క్లబ్‌లో.. 'ఇరుముడి'
టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్.. హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సంక్రాంతికి.. రవితేజ 'దాగుడు మూతలు దండాకోర్' ఫిక్స్