టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్.. హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:40 PM
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించేవారి వెనుక మరో రూపం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు.. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఎవరో ఒకరి చేతిలో మోసపోతూనే ఉంటారు.
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించేవారి వెనుక మరో రూపం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు.. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఎవరో ఒకరి చేతిలో మోసపోతూనే ఉంటారు. తాజాగా ఒక టాలీవుడ్ డైరెక్టర్.. ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకొంటానని నమ్మించి మోసం చేసినట్లు టాక్ నడుస్తోంది. టాలీవుడ్ లో ఆ కుర్ర డైరెక్టర్ రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు కొన్ని మంచి విజయాన్ని అందుకున్నా.. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. ఇండస్ట్రీలో అతను తెలియని వాడైతే కాదు. ప్రస్తుతం అతను ఒక మలయాళ హీరోతో పెద్ద ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు.
మరికొన్ని రోజుల్లో ఆ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈలోపే అతడిపై చెరిపినా చెరగని ముద్ర పడింది. ఆ కుర్ర డైరెక్టర్.. ఒక హీరోయిన్ ని ప్రేమ పేరుతో మోసం చేశాడట. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడట. అవన్నీ నమ్మి ఆ హీరోయిన్ ఈ కుర్ర డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మేసింది. ఇక ఆ తరువాత పెళ్లి పేరు ఎత్తుతుంటే.. కుర్ర డైరెక్టర్ మండిపడడం మొదలుపెట్టాడట. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆ చిన్నది పోలీసులను ఆశ్రయించింది. ఆ డైరెక్టర్ తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేయడం.. రిమాండ్ కి పంపడం కూడా జరిగాయని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ తెలుగు డైరెక్టర్ ఎవరై ఉంటారో అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఏదిఏమైనా ఇందులో నిజమెంత.. ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.