NSR Special Chitchat: హనుమాన్ అంశ్ విజయం వెనుక...
ABN, Publish Date - Oct 08 , 2026 | 04:34 PM
నీమ్ కరోలి బాబా జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన హనుమాన్ అంశ్ సినిమా ఉత్తరాదిన భారీ ఆదరణ పొందింది. అక్టోబర్ 9న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో ఎన్.ఎస్.ఆర్. జరిగిన స్పెషల్ చిట్ చాట్.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితగాథ ఆధరంగా హిందీలో తెరకెక్కిన సినిమా 'హనుమాన్ అంశ్'. ఇప్పటికే నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా అక్టోబర్ 9న తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా మేకింగ్ వెనుక ముచ్చట్లను, దీనికి ఉత్తరాదిన లభించిన ఆదరణను గురించి చిత్రం బృందంతో ఏబీయన్ చిత్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్ జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన హనుమాన్ అంశ్ చిత్రం. ఈ ఏడాది డివైన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నీమ్ కరోలి బాబా పాత్రను శోభినవ్ సత్య చేయగా, ఇతర కీలక పాత్రలను చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ పోషించారు.