‘న్యూటన్స్ థర్డ్ లా’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ
ABN, Publish Date - Jul 30 , 2026 | 07:02 PM
సుమంత్ హీరోగా ఈటీవీ విన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ..
సుమంత్ (Sumanth) హీరోగా ఈటీవీ విన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton's 3rd Law). రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి క్రేజ్‌ని ఏర్పడేలా చేసింది. ఈ మూవీ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ..
ఇది ఒక ఇన్వెస్టిగేటివ్, ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ మూవీ. 1999, 2026 అనే రెండు విభిన్న టైమ్‌జోన్ల నేపథ్యంలో కథ సాగుతుంది. చర్యకు ప్రతిచర్య అనే పాయింట్‌తో కథ నడుస్తుంది కాబట్టే ఈ సినిమాకు ‘న్యూటన్స్ థర్డ్ లా’ అని టైటిల్ పెట్టాం. ఏ పుస్తకంలోనూ, ఏ సినిమాలోనూ రాని ఒక ఊహించని సర్‌ప్రైజింగ్ సన్నివేశం, ఎన్నో ట్విస్ట్‌లు, హై ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని సుమంత్ చెప్పారు. సుమంత్ గత 10 ఏళ్లలో ‘మళ్ళీ రావా’ తర్వాత సింగిల్ సిట్టింగ్ నరేషన్‌లో ఒకే చెప్పిన రెండో సినిమా ఇది. ఇందులో ఆయన వాసుదేవ్ అనే స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాప్ పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబుతో సుమంత్ తన 27 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారి కలిసి నటిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్, వినయ్ పాత్రలు కథలో అత్యంత కీలకమని, వాళ్ళ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయని సుమంత్ చెప్పారు. ఇంకా నాగార్జున 100వ చిత్రం, లెనిన్ సక్సెస్, తన తదుపరి సినిమాల గురించి సుమంత్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.