మంచు ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేస్తున్నారు!
ABN , Publish Date - Jun 10 , 2026 | 07:36 PM
వినోదాత్మక చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి '6 టీన్స్' మూవీతో కెరీర్ ప్రారంభించారు. తన తొలి చిత్రం రూ. 35 లక్షల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటే, రూ. 3.5 కోట్ల షేర్ వచ్చిందని చెబుతున్నారు నాగేశ్వరరెడ్డి. ఆ తర్వాత ఆయన వరుస విజయాలతో తెలుగు సినిమా రంగంలో కొనసాగుతున్నారు.
శ్రీకాంత్, లయ జంటగా నటిస్తున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్'తో దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు పెద్దంతగా కమర్షియల్ సక్సెస్ సాధించాలేదు. అయితే ఈ సినిమా తనకు పూర్వ వైభవం తీసుకొస్తుందని ఆయన చెబుతున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ వేంకటేశ్వరస్వామిగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో జనం ముందుకు రానుంది. '6 టీన్స్' పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డితో ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ ఇన్ ఛార్జ్ ఎన్.ఎస్.ఆర్. చేసిన స్పెషల్ చిట్ చాట్...