Tollywood: నర్సింగ్ యాదవ్ బాటలో చిత్ర యాదవ్...
ABN, Publish Date - May 20 , 2026 | 02:49 PM
స్వర్గీయ నర్సింగ్ యాదవ్ ఓల్డ్ సిటీలో షూటింగ్స్ సమయంలో మేకర్స్ కు అండగా నిలిచేవారు. ఇప్పుడు ఆయన భార్య చిత్ర సైతం అదే పని చేస్తున్నారు. అక్కడ జరిగే షూటింగ్స్‌కు అన్ని పర్మిషన్స్ తీసుకుని ఆమె నిర్మాతలకు సహకరిస్తున్నారు.
తెలుగు సినిమా రంగంలో అందరికీ తలలో నాలుకగా మెలిగిన వ్యక్తి నర్సింగ్ యాదవ్. ఆయన కన్నుమూసి దాదాపు ఐదేళ్ళు అయ్యింది. నర్సింగ్ యాదవ్ జీవించి ఉన్న సమయంలో ఓల్డ్ సిటీలో ఏ షూటింగ్ జరగాలన్నా... ఆయన సహకారం లభించేది. ఇప్పుడు ఆయన భార్య చిత్ర అదే పనిచేస్తున్నారు. ఓల్డ్ సిటీ షూటింగ్స్ కు ఆమె లైజనింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు నలభై చిత్రాల షూటింగ్స్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆమె నిర్వహించారు. ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఆమెతో జరిపిన ప్రత్యేక ముఖాముఖి: